నల్గొండ

ఫలించిన మిషన్ కాకతీయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్కట్‌పల్లి, సెప్టెంబర్ 25: పల్లెలన్నీ పచ్చదనంతో పాడి పంటలతో కళకళలాడాలన్న ముఖ్యమంత్రి కేసి ఆర్ కలలు నెరవేరే రోజులు రానే వచ్చాయని, అందుకోసం ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పనులు సత్ఫలితాలు ఇచ్చాయని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ పేర్కొన్నారు. మండలంలోని అక్కెనపల్లి, నక్కలపల్లిలో గల చెరువులను స్దానిక ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలసి పరిశీలించి సమీపంలో ఉన్న దేవాలయాలకు పూజలు నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాష్టవ్య్రాప్తంగా కురిసిన భారీ వర్షాలకు ప్రజలకు,రైతులకు కొంత ఇబ్బందులు చేకూర్చినప్పటికీ చెరువులన్నీ నిండి అలుగు పోయడం తెలంగాణ ప్రజలకు శుభదాయకమన్నారు. గతంలో ఎడారిగా మారిన తెలంగాణ జలకళతో గ్రామాలన్నీ ఆనందంలో మునిగి తెలుతున్నాయన్నారు. రానున్న రోజుల్లో రైతులకు, పశుగణాభివృద్దికి ఎలాంటి ఢోకా లేకుండా సస్యశ్యామలం కానున్నాయన్నారు. ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడ లేని విధంగా తలపెట్టిన మిషన్ కాకతీయ పనుల వల్ల చెరువులన్నీ మరమ్మత్తులకు నోచుకోవడంతో నిండుకుండలా తలపిస్తూ అలుగు పోయడంతో గ్రామాలల్లో రైతులు కంట ఆనందం వెళ్లువిరుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు బండా నరేందర్‌రెడ్డి, ఎంపీపీ రేగట్టె మల్లిఖార్జున్‌రెడ్డి, వైస్ ఎంపీపీ పద్మముత్తయ్య, సర్పంచులు అచ్చాలుగౌడ్, స్వామిగౌడ్, మాధవి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
ప్రజల మనోభావాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం
తుర్కపల్లి, సెప్టెంబర్ 25: మండలంలోని గంధమల్ల చెరువు రిజర్వాయర్ నిర్మాణంలో ఇండ్లు, భూములు కోల్పోతున్న వివరాలను ఎమ్మెల్యేతో కలసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని భువనగిరి పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్యగౌడ్ అన్నారు. ఆదివారం గంధమల్ల చెరువును సందర్శించి పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చారిత్రక నేపధ్యం ఉన్న గంధమల్ల చెరువును రిజర్వాయర్‌గా మార్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పులిచింతల, శ్రీశైలం, నీటిమానేరు, ఎల్ ఎండి ప్రాజెక్టులు నిర్మాణంలోనే 30 సంవత్సరాలు క్రితం తీసుకున్నా ఇప్పటివరకు తగిన నష్టపరిహారం అందలేదన్నారు.