నల్గొండ

శాస్త్ర విజ్ఞానమే ప్రగతికి సోపానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, సెప్టెంబర్ 25: శాస్ర్తియ విజ్ఞానమే సమాజ ప్రగతికి సోపానమని ప్రజల్లో శాస్ర్తియత పెంపొందించేందుకు మూఢ విశ్వాసాలను నిర్మూలించేందుకు జన విజ్ఞాన వేదిక చేస్తున్న కృషి అభినందనీయమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న జన విజ్ఞాన వేదిక రెండవ రాష్ట్ర మహాసభలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. హేతుబద్ధత, తర్కంతో కూడిన పనినే తాను మొదటి నుండి జీవితంలో అనుసరించేవాడినన్నారు. రాజకీయాల్లోకి వచ్చాకా ప్రజల విశ్వాసాలను గౌరవించాల్సివస్తుందన్నారు. అనేక వాదాలకు తర్కాలకు భారత ప్రజాస్వామ్యం, సమాజం వేదికగా నిలుస్తు శాస్ర్తియ విద్య ప్రగతికి దోహదం చేస్తుందన్నారు. సైన్స్‌ను కూడా మూఢ నమ్మకంగా మార్చి కొంతమంది ప్రజల బలహీనతలను సొమ్ము చేసుకుంటున్నారన్నారు. సైన్స్‌ను నమ్మే వ్యక్తిగా మూఢ విశ్వాలను వ్యతిరేకించేవాడిగా తాను గతంలో సూర్యాపేటలో జనవిజ్ఞాన వేదిక కార్యక్రమంలో నిప్పుల మీద నడిచానన్నారు. దయ్యం, దేవుడు వంటి వాటిపై తనకు నమ్మకం లేకపోయినా ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా హేతువాదం, శాస్ర్తియ ఆలోఛనలను విస్తరించేందుకు కృషి చేస్తానన్నారు.