నమ్మండి! ఇది నిజం!!

రాత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ థియరీ ఉంది. గర్భవతైన మహిళ పంచేంద్రియాలు సమర్థవంతంగా పని చేస్తాయి. మరి సిక్త్స్ సెన్స్ మాటేమిటి?
5512, రివర్‌సైడ్ అవెన్యూ, నార్త్ హాలీవుడ్, కేలిఫోర్నియాలో నివసించిన జేన్, రిచర్డ్ జీవితాల్లో ఈ అపూర్వ సంఘటన జరిగింది. గర్భవతైన జేన్ ఓ రోజు దినపత్రిక చదివే తన భర్త రిచర్డ్‌ని అడిగింది.
‘దగ్గర్లో ఏదైనా విమానం కూలిందా?’
‘లేదే? ఎందుకలా అడిగావు?’ రిచర్డ్ అడిగాడు.
‘తక్కువ ఎత్తులో ఎగిరే విమానం ఇంజన్ పాడైన శబ్దం నిన్న రాత్రి నాకు వినిపించింది’
ఆ రాత్రి విమానం ఎగిరే శబ్దానికి మెలకువ వచ్చిన జేన్ లేచి టైం చూస్తే సరిగ్గా 12.17. ఆమెకి విమానం ఇంజన్ ఆగిపోయిన గురగుర శబ్దం వినిపించడంతో రిచర్డ్ లేచి ఆందోళనగా చెప్పింది.
‘పరిగెత్తండి. విమానం మన ఇంటి మీద కూలుతోంది’
‘విమానం కూలడం ఏమిటి?’ నిద్రలోంచి పూర్తిగా మెలకువ రాని అతను అడిగాడు.
‘నిన్నటిలాగే నాకు ఇదే సమయానికి తక్కువ ఎత్తులో విమానం ఎగురుతూ కూలే శబ్దం వినిపించి మెలకువ వచ్చింది. మీకు వినిపించలేదా?’
‘లేదు. పీడకల వచ్చినట్లుంది. పడుకో’ చెప్పి అతను నిద్రపోయాడు.
మూడో రాత్రి కూడా రిచర్డ్‌కి భార్య అరుపులతో మెలకువ వచ్చింది. ఆమె తలుపు తెరచుకుని బయటకి పరిగెత్తుతూ అరిచింది.
‘లేవండి. విమానం ఇంటి మీద కూలుతోంది’
ఇద్దరూ బయటకి వచ్చాక విమానం లేని ఆకాశం వైపు జేన్ విస్మయంగా చూసింది.
రిచర్డ్ మర్నాడు ఆఫీస్ నించి తమ ఫేమిలీ డాక్టర్‌కి ఫోన్ చేసి గత మూడు రాత్రులు జరిగింది చెప్పాడు.
‘పెళ్లైన తొమ్మిదేళ్లకి జేన్ మొదటిసారి గర్భవతైంది. తన గర్భానికి ఏమైనా అవచ్చనే ఆందోళనతో పీడకలలు వచ్చి ఉండచ్చు. ఆలస్యంగా గర్భం వచ్చిన కొందరిలో ఇలాంటివి సహజమే’ ఆయన చెప్పాడు.
ఆరో రాత్రి ఆమె నిద్రపోకుండా గడియారం వంక చూస్తూండటంతో రిచర్డ్ చెప్పాడు.
‘గర్భవతయ్యాక నీ ఊహాశక్తి పెరిగినట్లుంది. డాక్టర్ నిన్ను ఓ రోజు ఇంకెక్కడైనా పడుకోమని సలహా ఇచ్చారు. మనం ఏ మోటల్‌కో వెళదామా?’
అకస్మాత్తుగా ఆమె ‘అదిగో విమానం కూలుతోంది’ అని అరుస్తూ భయంతో వణుకుతూ స్పృహ తప్పి పడిపోయింది.
మర్నాడు ఉదయం హాస్పిటల్లో మెలకువ వచ్చిన జేన్ తన భర్తతో చెప్పింది.
‘నాకా విమానం కనిపించింది. అది మన ఇంటి మీద కూలి రెక్క సీలింగ్‌లోంచి గదిలోకి పొడుచుకు వచ్చి కనిపించింది. ఆ రెక్క మీది నంబర్ కూడా నాకు స్పష్టంగా గుర్తుంది. ఎన్ 55272 కె’
‘మీరు ఇలా ఉద్రేకపడటం మీ గర్భస్థ శిశువుకి మంచిది కాదు’ డాక్టర్ మందలింపుగా చెప్పాడు.
రిచర్డ్ కొంత విచారించి ఆ నంబర్ గల విమానం తన ఇంటికి రెండు మైళ్ల దూరంలోని ఓ ప్రైవేట్ సంస్థకి చెందిందని తెలుసుకుని అక్కడికి వెళ్లి దాని పైలట్ బ్లాక్‌ని కలిసి మాట్లాడాడు. తన భార్యకి చాలా రాత్రులు 12.17 కి వచ్చిన కల గురించి చెప్పాడు. అతను ఆ విమానం చక్కగా పని చేస్తోందని, ప్రతీ వంద గంటల తర్వాత ఇంజన్‌ని ఓవర్‌హాల్ చేస్తామని, కాబట్టి అది పాడయ్యే అవకాశం ఉండదని చెప్పాడు. ఓవర్ హాల్ క్రితం రోజే పూర్తయిందని కూడా చెప్పాడు.
‘నేను సమర్థవంతుడైన పైలట్‌ని. అది ఎన్నడూ కూలదని, కూలినా మీ ఇంటి మీద కూలదని మీ ఆవిడకి ధైర్యం చెప్పండి’ అతను నవ్వుతూ చెప్పాడు.
హాస్పిటల్ నించి డిశ్చార్జ్ ఐన జేన్‌ని తమ ఇంటికి కాక డాక్టర్ సలహా మీద రిచర్డ్ ఓ మోటెల్‌కి తీసుకెళ్లాడు. ఆ రాత్రి ఎప్పటిలానే ఆమె తన మంచం మీద పడుకుంది.
‘్భయం తగ్గిందా?’ రిచర్డ్ అడిగాడు.
‘కొద్దిగా. బహుశ ఇంతకాలం హాస్పిటల్లో ఉండటంవల్ల అనుకుంటాను. ఆ కల రాలేదు’
‘ఈ రాత్రి కూడా నీకా కల రాకపోతే మనం ఇల్లు మారదాం’ రిచర్డ్ ధైర్యం చెప్పాడు.
రాత్రి రిచర్డ్‌కి అకస్మాత్తుగా మెలకువ వచ్చింది. తల తిప్పి చూస్తే జేన్ నిద్రపోతోంది. అతనికి విమానం ఇంజన్ గురగుర శబ్దం వినిపించింది. రిచర్డ్ ఆమెని లేపి చేతిని పట్టుకుని గదిలోంచి బయటకి తీసుకెళ్లాడు. వాళ్లు బయటకి వెళ్లాక పడక గదిలోని సీలింగ్‌ని ఛేదించుకుని ఓ విమానం రెక్క లోపలకి దిగబడింది. అప్పుడు సమయం రాత్రి సరిగ్గా 12.17. దాని మీది నంబర్ ఎన్ 55272 కె. పైలట్ పేరాచ్యూట్‌తో దిగడంతో రక్షింపబడ్డాడు.
ఆ రాత్రి ఆమెని విమానం కూలే మోటెల్‌కి ఒకో అడుగు వేయిస్తూ ఎవరు చేర్చారు? జేన్‌కి విమానం కూలడం గురించి ముందే ఎలా తెలిసింది? ఆ విమానాన్ని చూడకపోయినా ఆ నంబర్ని ఆమె ఎలా చెప్పగలిగింది? ఈ ప్రశ్నలకి జవాబులు దేవుడికే తెలియాలి.