నమ్మండి! ఇది నిజం!!

డాక్ బంగ్లా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈసంఘటన ఇండియాలో పుట్టి పెరిగిన ఇంగ్లీష్ రచయిత రుడ్యార్డ్ కిప్లింగ్ జీవితంలో జరిగింది. ఓసారి అతను కలకత్తా నించి ముస్సోరీకి వెళ్లాడు. వర్షం, ఈదురుగాలి ఉన్న ఆ రాత్రి ఓల్డ్ రోడ్లోని గవర్నమెంట్ డాక్ బంగ్లాలో బస చేశాడు. ఎర్రటి ఇటుకల గోడలు, పైన రైలు పట్టాలని దూలాలుగా వాడిన కప్పుగల ఆ బంగ్లాలోని ప్రతీ గదిలోని ఫర్నిచర్ మీద దాని పేరు, నంబర్ తెల్లరంగుతో పెయింట్ చేసి ఉన్నాయి. గతంలో అక్కడ బస చేసిన చివరి వ్యక్తి పదిహేను నెలల క్రితం బస చేసాడని రిజిస్టర్లోని ఎంట్రీని బట్టి తెలుసుకున్నాడు. గుమ్మంలోనే ఓ పాము అతనికి స్వాగతం చెప్పింది.
కిప్లింగ్ అలహాబాద్, డల్హౌసి, సిమ్లా, లాహోర్, పెషావర్‌లలోని అనేక డాక్ బంగ్లాలలో బస చేశాడు. వాటిలో దెయ్యాలు ఉంటాయని విన్నాడు కాని అతనికి ఎన్నడూ వాటితో పరిచయం కాలేదు.
ముస్సోరీలోని డాక్ బంగ్లా చాలా పాతది. అక్కడక్కడా శిథిలం అవుతున్న దానికి మరమ్మతులు చేయలేదు. చెక్కనేల అరిగిపోయింది. ఆ గదులని స్థానిక సబ్ డ్యూటీ అసిస్టెంట్స్ ఉపయోగిస్తూంటారు. వారంతా భారతీయులు. తెల్ల సాహిబ్స్ దానికి రావడం అరుదని కేర్ టేకర్ చెప్పాడు. గతంలో అక్కడ బస చేసిన కొందరు తెల్లవాళ్ల పేర్లు చెప్పి, వారిలో ఎవరైనా తెలుసా అని అడిగాడు. పాతికేళ్ల క్రితం వారిలోని ఒకరు ఈ బంగ్లాలోనే మరణించారని, ఆ ఆవరణలోనే అతని శవాన్ని పాతిపెట్టారని చెప్పాడు.
ఆహారంలో ఎంపిక లేదు. అతను పెట్టిందే తినాల్సి వచ్చింది. కిప్లింగ్ గది కాక ఆ బంగ్లాలో మరో మూడు గదులు ఉన్నాయి. వాటి మధ్య గోడలు బాగా పల్చటివి. నడుస్తూంటే నేల చప్పుడు చేస్తూంటుంది. గాజు చినీల కొవ్వొత్తుల స్టాండ్స్ మాత్రమే ఉన్నాయి తప్ప విద్యుత్ సరఫరా లేదు. బాత్‌రూంలో కిరసనాయిలు దీపం ఉంది. కిప్లింగ్‌కి అనుభవం ఉన్న డాక్ బంగ్లాలు అన్నిటిలో ఇది అత్యంత అసౌకర్యమైందిగా భావించాడు. చలిగా ఉన్నా కట్టెలు లేక ఫైర్ ప్లేస్‌లో నిప్పు లేదు. కిటికీ తలుపులు తెరచుకోవు. వర్షపు చినుకులు కప్పు మీద, అద్దాల మీద పడి చప్పుడు చేస్తున్నాయి. బయట చెట్ల నించి గాలి ఈలలు వినిపిస్తున్నాయి. బంగ్లా ఆవరణలోంచే ఐదారు నక్కల ఊళలు వినిపించాయి.
కేర్ టేకర్ సగం ఇంగ్లీష్, సగం స్థానిక ఆహారాన్ని తెచ్చాడు. దోమతెర ఉన్నా కిప్లింగ్‌కి ఆ రాత్రి నిద్ర పట్టకపోవడానికి ఐదారు కారణాలు ఉన్నాయి. గాలి ఏదో చెప్తున్నట్లుగా అనిపించింది. బాత్‌రూంలోని దీపం గదిలోకి వింత నీడలని ప్రసరిస్తోంది. చివరికి నిద్ర పడుతూండగా అతనికి చప్పుడుకి మెలకువ వచ్చింది. బయట నించి ఎవరో తన గది పిడిని తిప్పే చప్పుడది.
‘ఎవరది?’ అరిచాడు.
జవాబు లేదు. అడుగుల చప్పుడు వినపడక పోవడంతో గాలికి తలుపు కదిలింది అనుకున్నాడు. కొద్దిసేపటికి మళ్లీ అతనికి మరో శబ్దానికి మెలకువ వచ్చింది. పక్క గదిలో ఎవరో బిలియర్డ్స్ ఆడుతున్నారు. ఒక్కోసారి బిలియర్డ్ స్టిక్ బంతిని కొట్టిన శబ్దం. మరోసారి ఆ చెక్క బంతి మరో చెక్క బంతిని తాకిన శబ్దం వినిపించసాగాయి. తను తప్ప ఆ రాత్రి ఎవరూ అతిథులు లేరని కిప్లింగ్‌కి తెలుసు. భయంతో అతని ఒళ్లు గగుర్పొడిచింది. కాని అంతలోనే బహుశ ఆ రాత్రి సబ్ డిప్యూటీ అసిస్టెంట్ తన మిత్రులతో పక్క గదిలోకి వచ్చి ఉంటాడని భావించాడు. అతనికి ఆ శబ్దాలు దెయ్యం వల్ల కలగచ్చనే ఆలోచన రాలేదు.
అకస్మాత్తుగా కిప్లింగ్‌కి పక్క గదిలో బిలియర్డ్స్ బల్ల లేదన్న సంగతి గుర్తొచ్చింది. వెంటనే అది దెయ్యం పనా అనే అనుమానం కలిగి, అతనికి భయం వేసింది. లేచి పక్క గదిలోకి వెళ్లి చూసే ధైర్యం చేయలేదు. ఎందుకంటే అప్పటికే అతని రక్తంలో చాలా భాగం గుండె దగ్గరికి చేరుకుంది. అక్కడ ఆడే వాళ్లు కనిపించకపోవచ్చు. లేదా కనిపించి తనని ఆటకి ఆహ్వానించచ్చు. చాలాసేపటికి కాని ఆట ఆగలేదు. తర్వాత కిప్లింగ్ నిద్రపోయాడు.
ఉదయం ఆలస్యంగా నిద్ర లేచాక కేర్ టేకర్ని అడిగాడు.
‘పక్క గదిలో నిన్న రాత్రి బిలియర్డ్స్ ఆడింది ఎవరు?’
‘ఎవరూ లేరు సాహెబ్. నాకు తెలిసి పదీ లేదా పదిహేనేళ్ల క్రితం బిలియర్డ్స్ రూం. రైలు పట్టాలని పర్యవేక్షించిన సాహెబ్‌లు అక్కడ బిలియర్డ్స్ ఆడేవారు. వారికి నేను బ్రాందీని ఇస్తూండేవాడిని. ఆ మూడు గదులూ కలిసి ఒకే గదిలో ఉండి, దాని మధ్య బిలియర్డ్స్ టేబిల్ ఉండేది. వాళ్లు ప్రతీ రాత్రి ఆ ఆట ఆడేవాళ్లు. ఇప్పుడు వాళ్లంతా పోయారు’
‘ఆ సాహెబ్‌లు నీకు గుర్తున్నారా?’ కిప్లింగ్ అడిగాడు.
‘నాకు ఒక్కరే గుర్తున్నారు. లావుగా ఉండే అతనికి కోపం ఎక్కువ. ‘మంగళ్‌ఖాన్! బ్రాందీ, పానీ దే’ అనగానే అతని గ్లాస్‌ని నింపేవాడ్ని. ఆట ఆడుతూ ఓ రాత్రి టేబిల్ మీదకి పడిపోయాడు. అతని శవాన్ని బయటకు తీసుకెళ్లడానికి నేను సహాయం చేశాను. అతను బరువైనవాడు’
కిప్లింగ్ పక్క గదిలోకి వెళ్లి చూశాడు. అది బిలియర్డ్స్ టేబిల్ పట్టనంత చిన్నది. కిటికీలోంచి సూర్యకాంతి పడుతోంది. కిటికీ రెక్క కొట్టుకుని తనకా భ్రమ కలిగిందా అనుకున్నాడు. పరిశీలిస్తే దానికి లోపల బోల్ట్ పెట్టి ఉంది. తను విన్నది బిలియర్డ్స్ బంతుల శబ్దమే అని అతనికి స్పష్టంగా తెలుసు.
మరి ఆట ఎలా వినిపించిందని ప్రశ్నిస్తే మంగళ్ సింగ్ తల వంచుకుని చెప్పాడు.
‘ఇక్కడ దెయ్యం ఉందని ప్రచారం చేస్తే నా ఉద్యోగం పోతుంది. వర్షం వల్ల మీకా శబ్దం వినిపించి ఉండచ్చు’
మూడు రోజులు ఉందామనుకున్న కిప్లింగ్ వెంటనే ఆ బంగ్లాని ఖాళీ చేశాడు.
ఈ అనుభవంతో కిప్లింగ్ తర్వాత ‘మై ఓన్ ట్రూ ఘోస్ట్ స్టోరీ’ అనే కథని రాశాడు.
ఆ రాత్రి టేబిల్ కాని, బంతులు కాని లేని ఆ ఆటని ఆ గదిలో ఎవరు ఆడారు? దేవుడికే తెలియాలి.