రాష్ట్రీయం

సమాజ హితమే సద్గురు ఆశయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనుమానాలను నివృత్తి చేసిన మహనీయుడు
విశ్రాంత న్యాయమూర్తి నర్సింహారెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 21: భక్తులు అడగని ప్రశ్నలకు సమాధానమివ్వటంతో పాటు, మనస్సులోని అనుమానాలను నివృత్తి చేసిన మహనీయుడు శ్రీ సద్గురు శివానందమూర్తి అని విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి అన్నారు. సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో సోమవారం సికింద్రాబాద్ టివోలీ గార్డెన్స్‌లో శివానంద ఎమినెంట్ సిటిజన్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన జస్టిస్ నర్సింహారెడ్డి అత్యంత ప్రతిష్ఠాత్మక అవార్డులను సైంటిఫిక్, ఇండస్ట్రియల్ రీసెర్చ్ సంస్థ పూర్వ డైరెక్టర్ జనరల్, పద్మవిభూషణ్ డా.ఆర్‌ఎ మషేల్కర్, అతి విశిష్ట సేవా మెడల్, పరమ విశిష్ట సేవా మెడల్‌లను స్వీకరించిన నేవీ వైస్ అడ్మిరల్ ఏఆర్ టాండన్‌లకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో శ్రీ సద్గురు శివానందమూర్తి సమక్షంలో తానెంతో మంది ప్రముఖులకు అవార్డులను ప్రదానం చేశానని చెప్పారు. సమాజానికి ఉత్తమమైన, విశిష్ఠ సేవలందించే ప్రముఖులను సత్కరించుకునే కార్యక్రమాలు ఆయన ఆశీస్సులతో ట్రస్టు మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. సమాజంలో అద్భుతమైన సేవలందించిన సైంటిస్టు, నేవీ అధికారికి మరోసారి పురస్కారాలు అందజేయటం సంతోషకరంగా ఉందన్నారు. మషేల్కర్ గురించి ప్రస్తావిస్తూ కష్టపడి, అంకితభావంతో పనిచేస్తే అత్యున్నతమైన శిఖరాలను అధిరోహించవచ్చునని నిరూపించారన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు మాట్లాడుతూ 32 ఏళ్ల సుదీర్ఘకాలంగా సద్గురు శివానందమూర్తితో తనకున్న అనుబంధాన్ని నెమరేసుకున్నారు. స్వామీజి కర్మయోగి, ప్రేమ యోగి అని అభివర్ణించారు. సమాజానికి ఎంతో హితోధికమైన సేవలందించారని, సమాజ శ్రేయస్సు, హితవుకోసం అహర్నిశలు కృషి చేసిన మానవతామూర్తి సద్గురు శివానంద మూర్తి అని శ్లాఘించారు. సద్గురు ఆలోచనల మేరకు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్టు ట్రస్టీ కె బసవరాజు మాట్లాడుతూ పూజ్య సద్గురు శ్రీ శివానంద మూర్తి దివ్యాశీస్సులు, ఆదేశాలతో స్థాపించబడి 22 ఏళ్లుగా నిరాటంకంగా భారతదేశంలో వివిధ రంగాల్లో అత్యున్నతమైన సేవలందిస్తోందని చెప్పారు. ఎందరో ప్రముఖులకు శివానంద ఎమినెంట్ సిటిజన్ అవార్డులతో సత్కరిస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు 115 మంది విశిష్ఠ వ్యక్తులను సత్కరించే అవకాశం కలిగిందని వివరించారు. ఆంధ్రభూమి సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీ దంపతులు హాజరైన ఈ కార్యక్రమంలో భాగంగా ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం తన తండ్రి పేరిట ఏర్పాటు చేసిన ఎల్‌ఎస్‌ఆర్‌కె పురస్కారాన్ని మషేల్కర్‌కు అందజేశారు. అనంతరం వివిఎస్ శర్మ రచించిన ‘శ్రీ కృష్ణ’ బుక్‌ను ఆవిష్కరించారు.
నా జీవితం సంపూర్ణమైంది!
సద్గురు శివానందమూర్తి పేరిట ఉన్న ఈ ప్రతిష్ఠాత్మకమైన అవార్డును స్వీకరించటంతో తన జీవితం సంపూర్ణమైందని అవార్డు గ్రహీత మషేల్కర్ సంతృప్తి వ్యక్తం చేశారు. పేదరికంతో గడిచిన తన జీవితాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు. టెక్నాలజీ అనేది సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటూ, ఉపయోగపడాలని ఆయన అభిప్రాయపడ్డారు. మషేల్కర్ వంటి గొప్ప వ్యక్తితో కలిసి ఈ అవార్డును స్వీకరించటం తనకెంతో ఆనందంగా ఉందని పరమ విశిష్ఠ సేవా మెడల్, శివానంద ఎమినెంట్ సిటిజన్ అవార్డు గ్రహీత డా. ఎఆర్ టాండన్ వ్యాఖ్యానించారు. కొన్ని చానెళ్లు టిఆర్‌పి రేటు పెంచుకునేందుకు సమాజానికి అవసరం లేని కార్యక్రమాలను బాగా ప్రచారం చేస్తున్నాయని, షీనాబోరా హత్య కేసుకు ఇచ్చిన పబ్లిసిటీని కార్గిల్ దివస్‌కు ఇవ్వటం లేదని ఆయన తెలిపారు. (చిత్రం) సికింద్రాబాద్ టివోలీ గార్డెన్స్‌లో సోమవారం జరిగిన శివానంద ఎమినెంట్
సిటిజన్ అవార్డుల ప్రదానోత్సవంలో అవార్డును స్వీకరిస్తున్న డా.ఆర్.ఏ.మషేల్కర్