డాక్టరేట్‌తో బాధ్యత పెరిగింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* నటుడు నరేష్
కామెడీ హీరోగా అప్పట్లో ట్రెండ్ క్రియేట్ చేసిన నరేష్ ప్రస్తుతం క్యారక్టర్ ఆర్టిస్టుగా బిజీగా మారాడు. ప్రస్తుతం ఆయన నటించిన ‘గుంటూర్ టాకీస్’ చిత్రం ఇటీవల విడుదలైంది. నటుడిగానే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న నరేష్‌కి అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ సంస్థ గౌరవ డాక్టరేట్‌ను అందించింది. ఈ అవార్డుని అన్ని రంగాల్లో నిష్ణాతులైన వారికి అందజేస్తారు. సౌత్ ఇండియా కేటగిరిలో ఈ అవార్డును ఆయన అందుకున్నారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ, తన 7వ ఏట నుండే సినిమాల్లో నటిస్తున్నానని, ఇప్పటివరకు 150 సినిమాలకు పైగా చేశానని, న్యూయార్క్ యూనివర్సిటీ అయిన ‘అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్’ సంస్థ నా ప్రొఫైల్‌ను చూసి ‘డాక్టర్ ఆఫ్ ఆర్ట్స్’ అవార్డును అందించడం ఆనందంగా వుందన్నారు. బెంగళూరులోని ఓ కార్యక్రమంలో ఈ అవార్డును అందుకున్నానని, ఈ అవార్డును నా గురువులైన జంధ్యాల, విజయనిర్మల, కృష్ణలకు అంకితం ఇస్తున్నానన్నారు. తానెప్పుడూ ఎప్పుడూ బిరుదులు తీసుకోలేదని, ఇటీవల తెలంగాణ స్పీకర్ చేతుల మీదుగా ‘నవరసరాయ బిరుదు’ను అందుకోవడం ఆనందంగా వుందన్నారు. అలాగే ఈ డాక్టరేట్‌తో నా బాధ్యత మరింత పెరిగిందని భావిస్తున్నానన్నారు. ప్రస్తుతం ‘శ్రీశ్రీ’ సినిమాలో కీలకపాత్ర చేస్తున్నానని, ఇటీవలే విడుదలైన గుంటూర్ టాకీస్ సినిమాలోని పాత్ర నాకు మంచి పేరు తెచ్చిపెట్టిందన్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాలో, మహేష్ బ్రహ్మోత్సవం సినిమాలో, సునీల్ ఈడుగోల్డెహె సినిమాలో నటిస్తున్నానని, మరిన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయన్నారు. నటుడిగానే కొనసాగాలని వుందని, ఇప్పట్లో రాజకీయాల్లోకి ప్రవేశించే ఉద్దేశం లేదన్నారు. అలాగే సామాజిక సేవా కార్యక్రమాలు యధావిధిగా కొనసాగిస్తానని అన్నారు.