మెయిన్ ఫీచర్

నషా.. ఇప్పుడో సంచలనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమె- ఉమ్మడి కుటుంబాల వద్దకు వెళుతుంది.. చిన్నాపెద్దా అందరినీ ఆప్యాయంగా పలకరిస్తుంది.. లేడీస్ హాస్టల్‌కు వెళ్లి అక్కడి టీనేజీ అమ్మాయిలతో కబుర్లు చెప్పి వాళ్ల ఇష్టాయిష్టాల గురించి ఆరా తీస్తుంది.. రోడ్డుపక్కన నిలబడి కాలక్షేపం చేసే యువకులను కలిసి వారితో సరదాగా మాట్లాడుతుంది.. విలక్షణమైన హెయిర్ స్టయిల్, అలరించే హావభావాలు, మాటల గారడీతో ఆమె అందరినీ ఇట్టే కట్టిపడేస్తుంది.. ఈ దృశ్యాలన్నీ ఇపుడు మనం ‘ఎయిర్‌టెల్ 4జి’ వాణిజ్య ప్రకటనల్లో చూస్తున్నవి.. ఆ ప్రకటనల్లో నటించిన 19 ఏళ్ల సషా ఒక్కసారి ‘సెలబ్రిటీ’గా మారిపోయింది. దేశవ్యాప్తంగా ఇపుడు ‘ఎయిర్‌టెల్ 4జి’ ప్రకటన ఇంతగా సంచలనం సృష్టిస్తోందంటే అందుకు సషాయే కారణమని మార్కెట్ వర్గాలు విశే్లషిస్తున్నాయి. ఈ ప్రకటన ఎంతగా జనంలోకి వెళ్లిందంటే- కుర్రకారే కాదు, ఇంట్లో చిన్నపిల్లలు సైతం ఆమె మాటలను అనుకరిస్తున్నారు. సషా ఇపుడు రోడ్డుమీదకు వెళ్లినా, ఏ గుంపులో ఉన్నా జనం ఆమెను ఇట్టే గుర్తుపట్టేస్తున్నారు.
మార్కెట్‌లో ఏదైనా వస్తువుకి విశేషం స్పందన లభించిందంటే- కొన్నిసార్లు ‘ప్రచారకర్త’లే ప్రధాన కారణం అవుతారని ‘4జి’ ప్రకటన విషయంలో రుజువైంది. ‘బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చి కౌన్సిల్ ఆఫ్ ఇండియా’ (బిఎఆర్‌సి) గణంకాల ప్రకారం సషా నటించిన ‘4జి’ ప్రకటన ఈ ఏడాది సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 20 మధ్యకాలంలో 54,406 సార్లు టీవీ చానళ్లలో 1,708,586 సెకన్ల పాటు ప్రసారమైంది. రెండు నెలల కాలంలో టీవీ తెరపై ఆమె 475 గంటల సేపు ప్రత్యక్షమైందట! ఇంతగా ప్రసారమైన వాణిజ్య ప్రకటన ఇటీవలి కాలంలో ఏదీ లేదు. 1.2 బిలియన్ల మంది భారతీయులు ఆ ప్రకటనల్ని చూసి మంత్రముగ్ధులయ్యారట! పల్లెసీమల నుంచి నగరాల వరకూ ‘4జి’ యాడ్‌ను టీవీల్లో వీక్షించిన వారి సంఖ్య ఇంతలా ఉండడంతో సషా ఇపుడు వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. ఆకట్టుకునే హెయిర్ స్టయిల్, మృదువైన మాటలు, సాదాసీదా వస్తధ్రారణ.. ఇవే ఆమె విజయ రహస్యాలుగా నిలిచాయి. 1980 నాటి కాలంలో ‘సర్ఫ్’ వాణిజ్య ప్రకటనలో నటించిన కవితా చౌదరికి ఎంతటి ఆదరణ లభించిందో ఇపుడు సషా అంతటి సంచలనం సృష్టిస్తోంది.
డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్)కు చెందిన సషా చెట్ట్రి ముంబయిలోని ‘క్సావియర్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్’లో అడ్వర్టయిజింగ్‌లో డిగ్రీ పూర్తి చేశాక ఓ ప్రకటనల సంస్థలో కాపీరైటర్‌గా చేరింది. ఎయిర్‌టెల్ ప్రకటనల్లో నటించేందుకు ముంబయికి చెందిన ఓ యాడ్ ఏజెన్సీ ఆమెను ఎంపిక చేసింది. ఇంటర్వ్యూలో నెగ్గుతానని ఊహించినప్పటికీ, ‘4జి’ ప్రకటన ఇంతలా సంచలనం సృష్టిస్తుందని తాను అనుకోలేదని ఆమె చెబుతోంది. సంగీతం అంటే తెగ ఇష్టపడే సషా ఇపుడు ఓ మ్యూజిక్ ఆల్బమ్‌ను రూపొందించే పనిలో నిమగ్నమైంది. పలు మోడలింగ్ ఏజెన్సీలు కూడా ఆమెతో ఒప్పందాలు చేసుకున్నాయి. నిజానికి సషాను చూస్తే చాలు- మనకు బాగా తెలిసిన పక్కింటి అమ్మాయిలా కనిపిస్తుందని, ఆమె హావభావాలు, వేషధారణ అత్యంత సహజంగా ఉండడమే ‘4జి’ యాడ్ విజయ రహస్యమని విశే్లషకులు అంటున్నారు. సినీతారలు నటించిన మిగతా వాణిజ్య ప్రకటనల కన్నా- సషాతో రూపొందించిన ‘4జి’ యాడ్‌కు అనూహ్య స్పందన లభిస్తోందని ఎయిర్‌టెల్ ప్రతినిధులు చెబుతున్నారు. వైవిధ్యంతో పాటు సహజత్వం ఉట్టిపడేలా ‘4జి’ ప్రకటన రూపొందించాలని తాము సషాను ఎంపిక చేశామని, తమ అంచనాలకు భిన్నంగా స్పందన లభించిందని ‘తత్ప్రూట్’ యాడ్ ఏజెన్సీ ప్రతినిధులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. *