జాతీయ వార్తలు

త్రయంబకేశ్వర ఆలయం వద్ద మహిళల ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: నాసిక్‌లోని జ్యోతిర్లింగ క్షేత్రమైన త్రయంబకేశ్వర ఆలయం వద్ద సోమవారం మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మహాశివరాత్రి సందర్భంగా గర్భగుడిలోనికి తమను అనుమతించాలని వారు పట్టుబట్టారు. భూమాత బ్రిగేడ్ సంస్థ ఆధ్వర్యంలో మహిళలు భారీ ర్యాలీ జరిపారు. ఆ సంస్థ అధినేత తృప్తి దేశాయ్ మహిళల ఆందోళనకు నాయకత్వం వహించారు. అహ్మద్‌నగర్ సమీపంలోని శనిసంగనాపూర్ ఆలయం వద్ద కూడా ఆమె ఇటీవల ఆందోళన చేశారు. త్రయంబకేశ్వర ఆలయం వద్ద సుమారు 150 మంది మహిళలు నినాదాలు చేస్తూ హోరెత్తించారు. వారిని గర్భగుడిలోకి పంపేందుకు ఆలయ అధికారులు, పోలీసులు అనుమతించలేదు.