అక్షర

ఇదొక సరికొత్త ప్రయోగం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నాటక రంగ ప్రముఖులు’
ధర: యాభై రూపాయలు.
ప్రతులకు: విశాలాంధ్ర అన్ని బ్రాంచీల్లోనూ

నాటకరంగ ప్రముఖుల వివరాలతో, ఈతరంకోసం ప్రచురించిన గ్రంథం ‘నాటకరంగ ప్రముఖులు’ ప్రశంసనీయం! 208 ప్రముఖుల సంక్షిప్త జీవిత విశేషాలతో వారి ఫొటోలతో సహా ఈ గ్రంథాన్ని ప్రచురించారు. గతంలో దాదాపు 50-60 ప్రాంతాలలో ఈ పనిని డా.మిక్కిలినేని రాధాకృష్ణమూర్తిగారు ఇలాంటి ప్రయోగమే చేశారు. తరువాత వెలువడ్డ ఈ గ్రంథం ఇదే రెండవది. ఇదొక రంగస్థల నాటకాలు రాసిన వారి గురించిన వివరాలతో కూడిన, రెఫరెన్సు పుస్తకం. వీరు కొంతమందిని విస్మరించారేమో, పొరపాటునే కావొచ్చు ఈ గ్రంథంలో వారి పేర్లు లేకపోవడం చిన్న లోటే. అయితే వారే చెప్పుకున్నారు. సమయాభావంచేత 200 మందిని మాత్రమే వాళ్ల వివరాలతో ఈ గ్రంథం తీసుకురావడం జరిగిందని. నాటకానికి గాను పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి బహుమతి పొందిన వారి వివరాలూ లేకపోవడం ఒక లోటే. ఈ సమాచారం, విశ్వవిద్యాలయంలోనే సేకరిస్తే బాగుండేది. ఇలాంటి పొరపాట్లను సరిదిద్దుకుంటూ వారి రాబోయే మరో ముద్రణలోనో మరో ప్రచురణలోనో సరిచూసుకుంటే బాగుంటుంది.

-శారదా అశోకవర్ధన్