జాతీయ వార్తలు

హెచ్‌సియు వ్యవహారాలపై జోక్యం చేసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 29: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సియు)లో జరిగిన పరిణామాలపై జోక్యం చేసుకోవాలని కాంగ్రెస్ బృందం రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి విజ్ఞప్తి చేసింది. మంగళవారం కాంగ్రెస్ సీనియర్ నాయకుల బృందం రాష్టప్రతిభవన్‌లో ప్రణబ్ ముఖర్జీతో సమావేశం అయింది. అనంతరం పార్టీ సీనియర్ నేత సుశీల్‌కుమార్ షిండే మాట్లాడుతూ హెచ్‌సియు వీసీగా అప్పారావు తిరిగి బాధ్యతలు స్వీకరించడంతోనే ఆశాంతి మొదలైందని, అప్పారావును తొలగించాలని రాష్టప్రతిని కోరినట్లు తెలిపారు. పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య అనంతరం శాంతియుతంగా ఉన్న వర్శిటీకి మళ్ళీ ఆప్పారావును వీసీగా తీసుకొచ్చి కేంద్రం సమస్యను సృష్టించిందని రాష్టప్రతి దృష్టికి తీసుకెళ్ళామన్నారు. శాంతియుతంగా అందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు పాశవికంగా దాడి చేశారని తెలిపామన్నారు. వీసీ అప్పారావుపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైనప్పటికీ అరెస్టుకాని, విచారణకానీ జరపలేదని వివరించారు. ఉత్తరాఖండ్ రాజకీయ పరిణామాలు కూడా రాష్టప్రతికి తెలిపామన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఖర్గే,అనంద్ శర్మ, షీలాదీక్షిత్ తదితరులు రాష్టప్రతితో సమావేశం అయిన వారిలో ఉన్నారు.