జాతీయ వార్తలు

నోట్ల రద్దు తర్వాత 5 కోట్ల నగదు మార్పిడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 26: ఎన్డీఏ పాలనలో ప్రధాని మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత కూడా బీజేపీకి చెందిన ఒక నేత ఐదు కోట్ల రూపాయల విలువైన రద్దయిన నోట్లను 40 శాతం కమీషన్‌కు మార్చారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ మేరకు కాంగ్రెస్ 30 నిముషాల వ్యవధిగల వీడియోను మీడియాకు విడుదల చేసింది. కాంగ్రెస్ నేత కపిల్‌దేవ్, కొందరు సీనియర్ నేతలతో పాటు ఆ పార్టీ మిత్రపక్షాలైన ఆర్‌జేడీ, లోక్‌తాంత్రిక్ జనతాదళ్, నేషనల్ కాన్ఫరెన్స్, టీడీపీ తదితర పార్టీల నేతలతో కలిసి విలేఖరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా 30 నిముషాల నిడివి గల వీడియోను విడుదల చేసిన కపిల్‌దేవ్, ఆ వీడియోను అహ్మదాబాద్‌లో ఒక సీనియర్ జర్నలిస్టు తీశారని తెలిపారు. నవంబర్ 8న మోదీ ప్రభుత్వం 500, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేసిందని, అయితే పాత నోట్లను మార్పిడి చేసుకోవడానికి స్వల్ప వ్యవధిని ఇచ్చిందని, అయితే ఆ వ్యవధి ముగిసిన తర్వాత కూడా ప్రముఖ బీజేపీ నేతకు సన్నిహితుడైన వ్యక్తి ఒకరు అదే ఏడాది డిసెంబర్ 31న ఐదు కోట్ల రూపాయల రద్దయిన నోట్లను 40 శాతం కమీషన్‌తో మార్పిడి చేశారని తెలిపారు. తాను చౌకీదార్‌నని చెప్పుకుంటున్న మోదీ అప్పట్లో నోట్ల రద్దు నిర్ణయంతో ప్రజల సొమ్మును ఎలా దోచుకున్నారో ఈ వీడియో ద్వారా తెలుస్తోందని ఆయన ఆరోపించారు. ప్రజలు సొమ్మును ఇలా పట్టుకుపోయిన మోదీ దానిని తన పార్టీ వాళ్లకు ఇచ్చారని అన్నారు. దీనిని బట్టి ఎవరు కాపలాదారుడు, ఎవరు దొంగో అర్థమవుతుందని చెప్పారు. కాగా కపిల్‌దేవ్ ప్రదర్శించిన అస్పష్టంగా ఉన్న వీడియోలో ఆ వ్యక్తి ఎవరన్నది సరిగా కన్పించలేదు. ఈ సందర్భంగా జరిగిన సంభాషణ, వెనుక వ్యాఖ్యానం ఉన్న వీడియోలో ఉన్నది ఎవరో వెల్లడించలేదు. తన ఆరోపణలు రుజువు చేసే ఇతర ఆధారాలను ఏవీ కపిల్ సిబాల్ వెల్లడించ లేదు.
ఆ వీడియో నకిలీది: జైట్లీ
ఇలాంటి నకిలీ ఆధారాలతో తమపై బురద జల్లడం యూపీఏ ఇంకా కొనసాగిస్తూనే ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మండిపడ్డారు. నకిలీ బిఎస్‌వై డైరీ, లండన్‌లో ఈవీఎంల ట్యాంపరింగ్‌పై ఆరోపణలు, కర్నాటక మాజీ మంత్రి యెడ్యూరప్ప 1800 కోట్లను బీజేపీ సీనియర్ లీడర్లకు లంచంగా ఇచ్చారనడం, ఈ సందర్భంగా ఇన్‌కం టాక్స్ స్వాధీనం చేసుకున్న డైరీల్లో యెడ్యూరప్ప కొందరి పేర్లు రాసారని చెప్పడం ఇవన్నీ యూపీఏ దిగజారుడుతనాన్ని తెలియజేస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ నోట్ల మార్పిడి వీడియో కూడా నకిలీదేనని ఆయన స్పష్టం చేశారు.