జాతీయ వార్తలు

యథేచ్ఛగా మద్యం, నగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 26: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత దేశంలో మద్యం, నగదు, డ్రగ్స్ ఏరులై పారుతోంది. దేశవ్యాప్తంగా రూ. 540 కోట్ల రూపాయల విలువైన సొత్తును ఇప్పటి వరకూ స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ వివరాలు వెల్లడించింది. ఇందులో మొదటి స్థానంలో తమిళనాడు నిలిచింది. అక్రమ మద్యం, నగదు, సామగ్రి విచ్చలవిడిగా చలామణి అయిపోతోంది. రూ.107.24 కోట్ల నగదు తమిళనాడులో స్వాధీనం చేసుకున్నారు. రెండో స్థానంలో యూపీ, మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచాయి. యూపీలో రూ.104.53 కోట్ల రూపాయలు, ఆంధ్రప్రదేశ్‌లో రూ.103.4 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్టు ఈసీ పేర్కొంది. పంజాబ్‌లో రూ.92.8 కోట్లు పట్టుకున్నారు. కర్నాటకలో రూ. 26.53 కోట్లు, మహారాష్టల్రో రూ. 19.11 కోట్లు, తెలంగాణలో రూ.8.2 కోట్లు విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా రూ.539.99 కోట్ల విలువైన సొత్తు ఈ పదిహేను రోజుల్లో పట్టుకున్నట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. మార్చి 10 నుంచి 25 వరకూ రూ. 143.37 కోట్ల నగదు పట్టుకున్నారు. అలాగే రూ. 89.64 కోట్ల విలువైన మద్యం, రూ.131.75 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు తనిఖీల్లో దొరిగాయి. బంగారం, విలువైన ఆభరణాలు మొత్తం కలిపి రూ.162.93 కోట్లని అధికారులు పేర్కొన్నారు. ఇవి కాకుండా గిఫ్టులు, కానుకలు కలిపి రూ. 12.20 కోట్లు. ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించడానికి జనరల్ అబ్జర్వర్లు, వ్యయ అబ్జర్వర్లు, మొబైల్ బృందాలు, స్టాటిక్ బృందాలను రంగంలోకి దించారు. ఏప్రిల్ 11న ప్రారంభమయ్యే లోక్‌సభ పోలింగ్ ఏడు దశల్లో జరుగుతుంది. మే 23న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.