జాతీయ వార్తలు

కాంగ్రెస్‌లోకి శతృఘ్న సిన్హా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, మార్చి 26: బాలీవుడ్ నుంచి రాజకీయ నాయకుడిగా అవతారమెత్తిన సినీనటుడు శతృఘ్న సిన్హా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈనెల 28న ఆయన న్యూఢిల్లీలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్టు ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు మంగళవారం స్పష్టం చేశారు. గత మూడు దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో కొనసాగుతున్న శతృఘ్న సిన్హా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న బీహార్‌లోని పాట్నా సాహిబ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేయనున్నారు. ‘శతృఘ్న సిన్హా ఈనెల 28వ తేదీ ఉదయం 11.30 గంటలకు న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. పాట్నా సాహిబ్ నుంచి మా పార్టీ తరఫున ఆయనే అభ్యర్థిగా పోటీ చేస్తారు’ అని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల క్యాంపెయిన్ కమిటీ రాష్ట్ర చైర్మన్ అఖిలేష్ ప్రసాద్ సింగ్ మంగళవారం ఇక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తెలిపారు. పాట్నా సాహిబ్ లోక్‌సభ స్థానం నుంచి ఇప్పటికే రెండుసార్లు ఎంపీగా గెలిచిన శతృఘ్న సిన్హా స్థానంలో కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్‌ను బీజేపీ ఎంపిక చేసింది. శతృఘ్న సిన్హా పలు సందర్భాల్లో బీజేపీ అధిష్టానంతోపాటు ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. దీనిని సీరియస్‌గా పరిగణించిన బీజేపీ అధిష్టానం ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో పాట్నా సాహిబ్ స్థానంలో శతృఘ్న సిన్హా స్థానే కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ వైపు మొగ్గు చూపి టికెట్‌ను సైతం ఖరారు చేసింది. ఇదిలావుండగా, అధిష్టానం తీరుపై ఎంతోకాలంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న శతృఘ్న సిన్హా కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని ఎప్పటి నుంచో ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. చివరకు ఆయన కాంగ్రెస్‌లో చేరడానికి తేదీ సైతం ఖరారైందని అఖిలేష్ ప్రసాద్ సింగ్ తెలిపారు. అయితే, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో శతృఘ్న సిన్హా పార్టీ తీర్థం పుచ్చుకుంటారన్న మీమాంశ కొనసాగుతున్న నేపథ్యంలో అగ్ర నేతల సమక్షంలో ఆయన చేరుతారని పార్టీ ఎన్నికల క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ స్పష్టం చేశారు. ఇదిలావుండగా, పాట్నా సాహిబ్ స్థానం నుంచి శతృఘ్న సిన్హా అభ్యర్థిత్వంపై బీహార్‌లో ‘మహాగత్‌బంధన్’ కూటమిలో భాగస్వామి లాలూ ప్రసాద్ యాదవ్ నాయకత్వంలోని ఆర్‌జేడీ మధ్య విభేదాలు తలెత్తే అవకాశాలున్నాయని సంబంధిత వర్గాలు తొలుత అనుమానించాయి. వాస్తవానికి తమ కూటమిలో భాగంగా పాట్నా సాహిబ్ నుంచి కాంగ్రెస్ పోటీ చేయాలనుకుంది. అయితే, ఇపుడు స్వయంగా శతృఘ్న సిన్హానే కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టాలనుకుంటున్న నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య వివాదం సమసిపోయినట్టేనని ఆ వర్గాలు చెబుతున్నాయి.