జాతీయ వార్తలు

కోవింద్‌కు క్రొయేషియా అత్యున్నత పౌర పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్రేబ్, మార్చి 26: భారత రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్‌కు క్రొయేషియా దేశానికి చెందిన అత్యున్నత పౌర పురస్కారం గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ది కింగ్ టోమీస్లేవ్ లభించింది. ఎనిమిది రోజుల పాటు మూడు దేశాల పర్యటనలో భాగంగా మంగళవారం ఇక్కడకు రాష్ట్రపతి కోవింద్ వచ్చారు. ఆయన ఈ పర్యటనలో క్రొయేషియా, బొలీవియా, చిలీ దేశాల్లో పర్యటిస్తున్నారు. ఈ మూడు దేశాలతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు రాష్టప్రతి పర్యటన దోహదపడుతుందని విదేశాంగ శాఖ ప్రతినిధి చెప్పారు. తనకు లభించిన అత్యున్నత పురస్కారం పట్ల రాష్టప్రతి కోవింద్ హర్షం వ్యక్తం చేశారు. ఈ పురస్కారం, గౌరవం భారత్ ప్రజలకు దక్కుతుందని చెప్పారు. క్రొయేషియా దేశాభ్యున్నతికి స్నేహ హస్తం అందించే దేశాధ్యక్షుడికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. ఈ దేశంలో పర్యటించిన తొలి రాష్ట్రపతి కోవింద్ కావడం గమనార్హం.