జాతీయ వార్తలు

పేదరికంపై ‘సర్జికల్ స్ట్రైక్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, మార్చి 26: దేశంలో పేదరిక నిర్మూలనకు కనీస ఆదాయ పథకం అద్భుతంగా పనిచేస్తుందని, పేదరికంపై ‘సర్జికల్ స్ట్రైక్’లా పనిచేస్తుందని ఏఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పారు. దేశంలోని 20 శాతం మంది పేదలకు ఈ పథకం ఫలాలను అందిస్తామని అన్నారు. 21వ శతాబ్దంలో మన దేశంలో పేదలు ఉండరాదని అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఈ పథకాన్ని అమలు చేసి చూపిస్తామని అన్నారు. మంగళవారం గంగానగర్ జిల్లా సూరత్‌గడ్ పట్టణంలో జరిగిన కాంగ్రెస్ ర్యాలీలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ ధనవంతులు, బడా పారిశ్రామికవేత్తలకు మాత్రమే ప్రభుత్వ సొమ్మును పంపిణీ చేస్తున్నారని, పేదలకు రుణాలు పంపిణీ చేయడంలో కాంగ్రెస్ ముందంజలో ఉంటుందని అన్నారు. తాము ప్రకటించిన కనీస ఆదాయ పథకంతో బీజేపీ కుదేలైందని.. బీజేపీ నేతల గుండెల్లో దడ పుట్టిస్తోందని అన్నారు. దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న ప్రజలకు సంక్షేమ ఫలాలు, కనీస ఆదాయం గ్యారంటీ స్కీమ్ ప్రయోజనాలను అందించాలన్న సంకల్పంతో పార్టీ పనిచేస్తోందన్నారు. బీజేపీ పేదలను నిర్మూలించాలని చూస్తోందని.. తమ పార్టీ పేదరికాన్ని నిర్మూలిస్తుందని అన్నారు. మోదీ ప్రభుత్వ హయాంలో దారిద్య్రం, ఉపాధి పెచ్చుమీరాయని.. తమ పార్టీ ఈ స్కీంపై అనేక చర్చలు జరిపిందని, మేథోమథనం చేసి అమలులోకి తెస్తామని చెప్పారు. ప్రతి కుటుంబానికి కనీస ఆదాయం 12వేల రూపాయలు ఉండేటట్లుగా చేస్తామన్నారు. యూపీఏ హయాంలో 14 కోట్ల మంది ప్రజలకు పేదరికం నుంచి విముక్తి కల్పించామని, మోదీ ప్రభుత్వం అనుసరించిన పథకాలవల్ల వీరంతా మళ్లీ పేదరికంలోకి జారుకున్నారని అన్నారు. జాతీయ ఉపాధి హామీ, ఆహార భద్రత, రుణమాఫీ పథకాలను బీజేపీ నీరుకార్చిందని అన్నారు. బీజేపీ పాలనలో పేదరికం, నిరుద్యోగం ప్రబలినట్లు చెప్పారు. బడా పారిశ్రామికవేత్తలు దేశంలో బ్యాంకుల సొమ్మును దోచుకున్నారని అన్నారు. గత ఎన్నికల్లో రెండు కోట్ల మంది యువకులకు ఉద్యోగాలు ఇస్తామని, రూ.15 లక్షల ప్రతి పేదవాడి ఖాతాలో జమచేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని అన్నారు. ఇంతవరకు ఉద్యోగాలు కల్పించలేదని విమర్శించారు. తాను ప్రధానమంత్రిగా కాకుండా చౌకీదార్‌గా పనిచేస్తానని చెప్పిన ప్రధాని మోదీ ఈ రోజు అనిల్ అంబానీ చౌకీదార్‌గా మారిపోయారని అన్నారు. బ్యాంకు సొమ్మును లూటీ చేసిన పారిశ్రామికవేత్తలకు ఎన్డీయే ప్రభుత్వం సహకరించిందని అన్నారు. ఆర్థిక నేరగాళ్లు నీరవ్ మోదీ, విజయ్ మాల్యాను ఇంకా దేశానికి ఎందుకు తీసుకురాలేదని నిలదీసిన రాహుల్.. రాఫెల్ డీల్ ఒక పెద్ద స్కామ్ అని విమర్శించారు.

చిత్రం.. రాజస్థాన్‌లో మంగళవారం ఓ ఎన్నికల సభలో రాహుల్ గాంధీ