జాతీయ వార్తలు

బీజేపీలో చేరిన జయప్రద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 26: ప్రముఖ నటి, మాజీ పార్లమెంట్ సభ్యురాలు జయప్రద భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ కార్యాలయంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి భూపేందర్ యాదవ్ ఆమెకు కాషాయ కండువా కప్పి, సభ్యత్వాన్నిచ్చి పార్టీలోకి ఆహ్వానించారు. కొన్ని రోజుల నుంచి జయప్రద పార్టీలో చేరతారన్న ప్రచారం జరిగింది. ఈ ప్రచారాలకు తెరదించిన ఆమె మంగళవారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా జయప్రద మాట్లాడుతూ తన పూర్తి జీవితం బీజేపీకి అంకితమని అన్నారు. సినీ రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ తాను మనస్ఫూర్తిగా పని చేస్తున్నానని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీలో చేరడం సంతోషంగా ఉందని, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం సురక్షితంగా ఉంటుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు గతంలో ఆమె ప్రాతినిధ్యం వహించిన ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్ పార్లమెంటరీ నియోజక వర్గం నుంచి బరిలోకి దిపింది. ఈ మేరకు రామ్‌పూర్ బీజేపీ అభ్యర్థిగా మంగళవారం బీజేపీ ప్రకటించింది. 1994లో తెలుగుదేశం పార్టీ సభ్యురాలిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన జయప్రద ఆ పార్టీ మహిళా అధ్యక్షురాలిగా పని చేశారు. అనంతరం ఆమె ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో విభేదాల కారణంగా తెలుగుదేశం పార్టీని వీడి ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ఆ పార్టీ నుంచి రామ్‌పూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 2004 నుంచి 2009, 2009 నుంచి 2014 మధ్య ఎంపీగా కొనసాగారు. 2010లో సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నాయకుడు అమర్‌సింగ్, జయప్రదలను పార్టీ వ్యతిరేక కార్యకాలపాల కారణంగా సస్పెండ్ చేసింది. వీరిద్దరూ రాష్టయ్ర లోక్‌మంచ్ పార్టీని ఏర్పాటు చేసి అనంతరం జరిగిన ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి ఘోరంగా ఓటమి చెందారు. తరువాత ఆర్‌ఎల్‌డి పార్టీలో చేరి 2014 ఎన్నికల్లో పార్టీ తరపున బిజ్‌నూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పటినుంచీ రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె ఇప్పుడు బీజేపీలో చేరారు. రామ్‌పూర్ స్థానం నుంచి సమాజ్‌వాది సీనియర్ నాయకుడు ఆజంఖాన్ పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఆమెను ఆజంఖాన్‌పై పోటీ చేసేందుకుగాను బీజేపీ రంగం సిద్ధం చేసింది. జయప్రద చేరికతో ఇప్పటికే హేమమాలిని లాంటి సినీతారలతో ఉన్న బీజేపీకి మరింత ఆకర్షణ చేకూరుతుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

చిత్రం.. ప్రముఖ సినీనటి, మాజీ ఎంపీ జయప్రద మంగళవారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆమెకు సభ్యత్వ పత్రాన్ని అందజేస్తున్న పార్టీ ప్రధాన కార్యదర్శి భూపేందర్ యాదవ్