జాతీయ వార్తలు

ఇకచాలు.. తప్పుకోండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 26: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఒక వ్యూహం ప్రకారం పార్టీలోని సీనియర్లందరినీ ఎన్నికల బరినుంచి తప్పిస్తున్నారు. మాజీ ఉప ప్రధాన మంత్రి లాల్‌కృష్ణ అద్వానీ గుజరాత్‌లోని గాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేయకుండా నిలువరించిన బీజేపీ అధినాయకత్వం ఇప్పుడు పార్టీ మాజీ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు మురళీ మనోహర్ జోషికి కూడా మొండిచెయ్యి చూపించింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి మరోసారి పోటీ చేయకూడదని బీజేపీ అధినాయకత్వం మాజీ కేంద్ర మంత్రి మురళీ మనోహర్ జోషిని ఆదేశించింది. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఆదేశం మేరకు పార్టీ సంస్థాగత వ్యవహారాలు నిర్వహించే ప్రధాన కార్యదర్శి రాంలాల్ ఇటీవల మురళీ మనోహర్ జోషికి టెలిఫోన్ చేసి పోటీ నుండి విరమించుకోవలసిందిగా కోరినట్లు తెలిసింది. వయస్సు ముదిరిన నాయకులు ఈసారి ఎన్నికల బరిలోకి దించకూడదనే నిర్ణయం తీసుకున్నది, ఈ నిర్ణయం ప్రకారం మిమ్మల్ని పార్టీ ఈసారి ఎన్నికల బరిలోకి దించటం లేదని రాంలాల్ మురళీ మనోహర్ జోషికి స్పష్టం చేసినట్లు తెలిసింది. అమిత్ షా వ్యవహరించిన తీరుకు మండిపడిన మురళీ మనోహర్ జోషి (85) తన లోక్‌సభ నియోజకవర్గం కాన్పూర్ ఓటర్లకు ఒక బహిరంగ లేఖ రాస్తూ పార్టీ ఆదేశం వివరాలు బైటపెట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ లేదా మరే ఇతర నియోజకవర్గం నుండి మీరు లోక్‌సభకు పోటీ చేయకూడదని పార్టీ ఆదేశించినట్లు రాంలాల్ నాకు తెలిపారు. అందుకే నేను ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయటం లేదని మురళీ మనోహర్ జోషి కాన్పూర్ ఓటర్లకు రాసిన లేఖలో వెల్లడించటం గమనార్హం. పార్టీకి చెందిన సీనియర్ నాయకుల స్థానంలో యువ నాయకులను ఎన్నికల బరిలోకి దించాలని బీజేపీ అధినాయకత్వం ఒక విధాన నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం మేరకు కనీసం ఇరవై ఐదు మంది సీనియర్ నాయకులకు ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వటం లేదని తెలిసింది. తెలంగాణకు చెందిన మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయకు కూడా ఈ విధాన నిర్ణయం మేరకే సికింద్రాబాద్ లోక్‌సభ టికెట్ కేటాయించలేదని అంటున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన మరో సీనియర్ నాయకుడు, లోక్‌సభ సభ్యుడు కల్రాజ్ మిశ్రా (77) కూడా 2014లో గెలిచిన దెయోరియా లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేయటం లేదు. వీరితోపాటు ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడు బీసీ ఖండూరి, జార్కండ్‌కు చెందిన సీనియర్ నాయకుడు కరియా ముండా, బిజోయ్ చక్రవర్తిని కూడా లోక్‌సభ ఎన్నికల బరినుండి తప్పించారు. వీరంతా 70 సంవత్సరాల వయస్సు దాటినవారు కావటం గమనార్హం. లాల్‌కృష్ణ అద్వానీ గుజరాత్‌లోని గాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి మొత్తం ఆరుసార్లు లోక్‌సభకు ఎన్నిక కావటం తెలిసిందే.
బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే లోక్‌సభ ఎన్నికల బరినుండి తప్పించిన సీనియర్ నాయకులలో కొందరికి గవర్నర్ పదవులు ఇవ్వడం.. మరి కొందరికి పార్టీ బాధ్యతలు ఇవ్వాలని అధినాయకత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది.
చిత్రాలు.. ఎల్ కే అద్వానీ *మురళీ మనోహర్ జోషి *బండారు దత్తాత్రేయ