జాతీయ వార్తలు

ప్రపంచ విద్యాకేంద్రంగా భారత్ అవతరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 26: భారత ఆర్థిక వ్యవస్థను విజ్ఞానమే నడిపించబోతోందని, ప్రజల జీవన పరిస్థితులను మెరుగుపరచడంలో విజ్ఞానం కీలక పాత్ర పోషించనుందని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. మంగళవారం ఇక్కడ ఆయన ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ రీసెర్చ్ 16వ స్నాతకోత్సవంలో మాట్లాడుతూ ప్రపంచంతో పోటీ పడే క్రమంలో భారత్ తన ఉన్నత విద్యా వ్యవస్థను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఉప రాష్ట్రపతి ఈ సందర్భంగా ఎనిమిది మందికి పీ.హెచ్‌డీ పట్టాలు, ఆరుగురికి ఎం.్ఫల్ పట్టాలు, 29 మందికి ఎం.ఎస్సీ డిగ్రీలను ప్రదానం చేశారు. ‘విద్యా వ్యవస్థ వలసవాద ఆలోచనా విధానం నుంచి బయటకు వచ్చి తనకు తాను కొత్త రూపం ఇచ్చుకోవాలి. విద్యా వ్యవస్థ వాస్తవ చరిత్రను వస్తుగత దృక్పథంతో బోధించాలి’ అని వెంకయ్య నాయుడు అన్నారు. ‘విద్య.. ఉద్యోగం కోసం మాత్రమే కాదు. అది విజ్ఞానాన్ని అందించడం ద్వారా వ్యక్తులను సాధికారులుగా తీర్చిదిద్దాలి. సంఘటిత వృద్ధికి, ఎలాంటి వివక్ష లేకుండా చూడటానికి అందరికి, అన్ని స్థాయిల్లో నాణ్యమయిన విద్యను అందించాలి’ అని ఆయన పిలుపునిచ్చారు. భారత్ మరోసారి ప్రపంచ విజ్ఞాన కేంద్రంగా అవతరించడానికి సమయం ఆసన్నమయిందని ఆయన అన్నారు. ‘ఇది సాధ్యం కావడానికి విద్యాకేంద్రాలు ప్రత్యేకించి విశ్వవిద్యాలయాలు మేధోసంపత్తిని అనే్వషించే కేంద్రాలుగా తమను తమను మలచుకోవాలి’ అని ఉప రాష్ట్రపతి సూచించారు.