జాతీయ వార్తలు

బడ్జెట్ సమావేశాలు ప్రోరోగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 29: కేంద్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను ప్రోరోగ్ చేసి సంచలనం సృష్టించింది. రాజకీయ సంక్షో భం కారణంగా ప్రస్తుతం రాష్టప్రతి పాలనలో ఉన్న ఉత్తరాఖండ్ ఏప్రిల్ 1వ తేదీ తర్వాత ఖర్చుల కోసం నిధులను సమకూర్చేలా ఆర్డినెన్సు జారీకి వీలుకల్పించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది. ఉత్తరాఖండ్ శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందిందని స్పీకర్ ప్రకటించిన విషయం తెలిసిందే. వివాదాస్పద పరిస్థితుల నడుమ ఆమోదించిన ఈ బిల్లు భవితవ్యంపై ప్రశ్నలు తలెత్తడంతో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన మంగళవారం పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సిసిపిఎ) సమావేశమై బడ్జెట్ సమావేశాలను ప్రోరోగ్ చేయాలని నిర్ణయించింది. పార్లమెంట్‌లో ఫిబ్రవరి 23వ తేదీన ప్రారంభమైన తొలి విడత బడ్జెట్ సమావేశాలు ఈ నెల 16వ తేదీ నుంచి ఆగిపోగా, ఏప్రిల్ 25వ తేదీ నుంచి రెండో విడత సమావేశాలు జరగాల్సిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16) ముగిసేందుకు ఇక రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండటం, రాష్టప్రతి పాలనలో ఉన్న ఉత్తరాఖండ్ తన ఖర్చుల కోసం ఏప్రిల్ 1వ తేదీ తర్వాత స్థిరీకృత నిధి (కన్సాలిడేటెడ్ ఫండ్) నుంచి నిధులను పొందేందుకు వీలు కల్పిస్తూ ఆర్డినెన్సు జారీచేసే స్థితిలో కేంద్ర ప్రభుత్వం లేకపోవడంతో బడ్జెట్ సమావేశాలను ప్రోరోగ్ చేయాలని సిసిపిఎ నిర్ణయించింది. సిసిపిఎ సమావేశం ముగిసిన అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని కలసి ఈ నిర్ణయానికి దారితీసిన పరిస్థితుల గురించి వివరించారు