జాతీయ వార్తలు

ఆర్‌బిఐ కొత్త బాస్ ఉర్జిత్ పటేల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 20: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) కొత్త గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆర్‌బిఐ గవర్నర్‌గా ఉన్న రఘురామ్ రాజన్ స్థానంలో ఉర్జిత్ పటేల్ ఆర్‌బిఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపడతారు. రాజన్ సెప్టెంబర్ 4న పదవీ విరమణ చేయనున్న విషయం తెలిసిందే. 52 ఏళ్ల ఉర్జిత్ పటేల్‌ను ఆర్‌బిఐ గవర్నర్‌గా నియమించినట్లు ప్రభుత్వం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. క్యాబినెట్ సెక్రటరీ నేతృత్వంలోని ఆర్థిక రంగ నియామకాల సెర్చ్ కమిటీ చేసిన సిఫార్సుల ఆధారంగా ఈ నియామకం జరిపినట్లు, విస్తృతమైన కసరత్తు చేసిన తర్వాత అపాయింట్‌మెంట్ కమిటీకి ఈ కమిటీ కొన్ని పేర్లను సూచించిందని ఆ ప్రకటనలో తెలిపారు. దీంతో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ నియామకంపై గత కొంతకాలంగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడింది. 52 ఏళ్ల ఉర్జిత్ పటేల్ ప్రస్తుతం ఆర్‌బిఐ డిప్యూటీ గవర్నర్‌గా ఉన్నారు. 2013లో ఆర్‌బిఐ డిప్యూటీ గవర్నర్‌గా నియమితుడు కావడానికి ముందు ఉర్జిత్ పటేల్ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపునకు సలహాదారుగా పని చేశారు. ఆయన కొంతకాలం రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో కూడా పని చేశారు. 1990నుంచి 95 మధ్య కాలంలో ఆయన అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)లో వివిధ విభాగాల్లో పని చేశారు. ఆర్‌బిఐ గవర్నర్‌గా నియమితులైన డిప్యూటీ గవర్నర్లలో ఉర్జిత్ పటేల్ ఎనిమిదో వ్యక్తి.