జాతీయ వార్తలు

మోదీని ఓడించేందుకు ఏమైనా చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాల నుంచి దేశాన్ని రక్షించడానికి తన పార్టీ ఏమయినా చేస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ఆయన ఆదివారం ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల (ఈవీఎంల) లోపాలపై చర్చించడానికి ఆదివారం ఇక్కడ ఆయన ప్రతిపక్షాలతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ‘దేశం ప్రమాదంలో ఉంది. దేశాన్ని రక్షించడానికి మేము ఏమైనా చేస్తాం. నరేంద్ర మోదీ, అమిత్ షాల నుంచి దేశాన్ని రక్షించడానికి మేము చేస్తున్న కృషి కొనసాగుతుంది’ అని కేజ్రీవాల్ అన్నారు. అయితే, ఆ సమయంలో అక్కడే ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబాల్ ఆప్‌తో పొత్తుపై అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం ఇవ్వకుండా ‘ఆయనకే బాగా తెలుసు’ అంటూ బంతిని కేజ్రీవాల్ కోర్టులోకి తోసేశారు. ‘పొత్తు గురించి ఆయననే అడగండి. ఆయనకే మాకన్నా బాగా తెలుసు’ అని సిబాల్ అన్నారు. కాగా, ‘మీకు కాంగ్రెస్ విధానం తెలుసు. ఢిల్లీలో పొత్తు దాదాపు పూర్తయింది. అయితే, ఇతర రాష్ట్రాలతో దీనిని ముడిపెట్టడం సరికాదు’ అని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ అన్నారు. ఆప్, కాంగ్రెస్‌ల మధ్య పొత్తుపై గత కొంత కాలంగా అనిశ్చితి కొనసాగుతోంది. ఢిల్లీ, హర్యానాలో సీట్ల పంపకాలపై ఈ రెండు పార్టీలు ఒక అంగీకారానికి రావడంలో విఫలం కావడం వల్ల వాటి మధ్య చర్చల ప్రక్రియ నిలిచిపోయింది.