జాతీయ వార్తలు

విపక్షాలది రాజకీయ అసహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: విపక్షాలు రాజకీయ అసహనం ప్రదర్శిస్తున్నాయని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ విమర్శించారు. ఈ కారణంగా నష్టపోయిన వారిలో ప్రధాని నరేంద్ర మోదీది మొదటి స్థానమని నఖ్వీ అన్నారు. మేధావులుగా తమను తాము పేర్కొంటున్న కొంత మంది సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించాల్సిందిగా ఓటర్లను కోరుతున్నారని అన్నారు. అయితే, మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చూసి లోక్‌సభ ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు బీజేపీకి మద్దతునిస్తున్నారని తెలిపారు. ఎన్డీఏకు మరోసారిఓటు వేసి గెలిపించాలని ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ కోరారు. మేధావులు, కళాకారుల మద్దతు కూడగట్టామని ఆయన తెలిపారు. ఐదేళ్ళ క్రితం జరిగిన ఎన్నికల సమయంలో మేధావులు అని చెప్పుకునే వారు కొందరు మోదీకి వ్యతిరేకంగా యూఎస్, యూరోపియన్ యూనియన్‌కు లేఖలు రాశారని నఖ్వీ అన్నారు. ప్రధాని పదవి నుంచి మోదీ నుంచి తొలగించాలని కొందరు కాంగ్రెస్ నాయకులు పొరుగు దేశమైన పాక్‌ను ఆశ్రయించారని కేంద్ర మంత్రి నఖ్వీ ఆరోపించారు. రాజ్యాంగం ప్రమాదంలో పడిందని కొంత మంది కాంగ్రెస్ నాయకులు రాష్టప్రతికి ఫిర్యాదు చేశారని ఆయన తెలిపారు. ఇది వారి అసహనానికి నిదర్శనమని అన్నారు. వీరు కుట్రలు, కుతంత్రాలు, దుష్ప్రచారాలు ఎన్ని చేసినా, ప్రజలు మాత్రం మోదీ వైపే ఉన్నారని అన్నారు. దేశ ప్రజల్లో మోదీ ప్రతిష్ట రోజు, రోజుకూ పెరుగుతున్నదని ఆయన తెలిపారు. మోదీ ప్రధాని అయిన తర్వాత దేశం ప్రగతి పథంలో నడుస్తున్నదని ఆయన చెప్పారు.