జాతీయ వార్తలు

14 మంది అభ్యర్థుల విద్యార్హతలు మెట్రిక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిబ్రుగడ్ ఏప్రిల్ 14: అస్సాంలో ఈనెల 11న జరిగిన తొలివిడత 14 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన 41 మంది అభ్యర్థుల్లో 14 మంది మెట్రిక్యులేషన్ లేదా అంతకంటే తక్కువ విద్యార్హతలు కలిగి ఉన్నారు. వీరిలో ప్రస్తుత సిట్టింగ్ బీజేపీ ఎంపీ కూడా ఉన్నారు. వీరంతా ఇటీవల తాము దాఖలు చేసిన నామినేషన్ పత్రాల అఫిడవిట్‌లలో పేర్కొన్నారు. అయితే, తొలి విడతగా జరిగిన లోక్‌సభ బరిలో ఒక మాజీ ఐఐటీ విద్యార్థి, పొలిటికల్ సైన్స్ రిటైర్డ్ మాజీ ప్రొఫెసర్, కొందరు న్యాయవిద్య, మరికొందరు మాస్టర్స్ డిగ్రీ చేసినవారు కూడా ఉన్నారు. 11న పోలింగ్ జరిగిన అస్సాంలోని ఐదు ఎంపీ స్థానాల్లో డిబుఘర్, లక్ష్మీపూర్, తేజ్‌పూర్, కాలిబర్, జొర్‌హత్ నియోజకవర్గాల్లో 75,16,284 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అస్సాంలోని చట్టాల ప్రకారం పంచాయతీ సభ్యుడిగా ఎవరు పోటీ చేయాలనుకున్నా కనీసం 6వ తరగతి పాసైవుండాలి. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం సైతం అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఎవరు పోటీ చేసినా కనీస విద్యార్హతలు కలిగి ఉండాలని కోరుతోంది. ఇదే విషయమై దాఖలైన ఒక అభ్యర్థనపై కూడా సుప్రీంకోర్టు పరిశీలిస్తోంది. డిబుఘర్ నుంచి బీజేపీ తరఫున రెండోసారి పోటీ చేసిన రామేశ్వర్ టేలి దులియాజన్‌లోని టిప్లింగ్ ఘాట్ హైస్కూల్‌లో హెచ్‌ఎస్‌ఎల్‌సీ చదువుకున్నారు. అయితే, ఈ ఎన్నికల్లో పోటీ చేసిన అతని ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ దిగ్గజం, కేంద్ర మంత్రి పబన్ సింగ్ ఘటోవర్ షిల్లాంగ్‌లోని సెయింట్ ఆంటోనీ కాలేజీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్‌లో డిగ్రీ చేశారు. మరో అభ్యర్థి టైటస్ భెంగ్రా డీహెచ్‌ఎస్‌కే కాలేజీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్‌గా పనిచేసి రిటైరయ్యారు. అంతేకాకుండా డిబ్రుఘ్ఢ్ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ కూడా ఆయన చేశారు. మిగిలిన ఇద్దరు అభ్యర్థులు మెట్రిక్యులేషన్ చదివారు. ఇజ్రాయిల్ నందా ట్రేడ్ యూనియన్ మేనేజిమెంట్ నుంచి డిప్లొమా పొం దారు. ఇక తేజ్‌పూర్ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ పడిన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఎంజీవీకే భాను ఢిల్లీ ఐఐటీ నుంచి ఇంజనీరింగ్‌లో మాస్టర్ డిగ్రీ చేశారు. ఈయన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి. అస్సాం అడిషనల్ చీఫ్ సెక్రటరీగా, టీ బోర్డు చైర్మన్‌గా పనిచేసిన ఆయన గత ఏడాది రిటైరయ్యారు. భానుకు ప్రత్యర్థులుగా నిలబడిన ఇండిపెండెంట్లు జియాబుర్ రహ్మాన్ ఖాన్ 10వ తరగతి మాత్రమే చదువుకున్నారు. మరో అభ్యర్థి ఇక్బాల్ అన్సారీ హయ్యర్ సెకండరీ పాసయ్యారు. ఇంకో అభ్యర్థి మహేంద్ర ఓరంగ్ మెట్రిక్యులేషన్ చదవగా, మహేంద్ర భుయాన్ (ఎన్‌సీపీ), పల్లాబ్ లచన్ దాన్ (బీజేపీ), బిజోయ్ కుమార్ తిరు (ఇండిపెండెంట్) డిగ్రీ చేసి ఉన్నారు. ఇక లక్ష్మీపూర్ స్థానం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ బోర్గోహైన్, బీజేపీకి చెందిన ప్రధాన్ బారువా మెట్రిక్యులేషన్‌తోపాటు మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేశారు. ఈ స్థానం నుంచి పోటీ పడిన మిగిలినవారిలో ఉబేదుర్ రహ్మాన్ (అసోం జన మోర్చా) ఏడో తరగతి, అంబజ్ ఉద్దీన్ (ఇండిపెండెంట్) మెట్రిక్యులేషన్, ప్రభు లాల్ వైష్ణవ (ఇండిపెండెంట్) హయ్యర్ సెకండరీ పాసయ్యారు. మిగిలిన ముగ్గురు అభ్యర్థుల్లో ఇద్దరు హేమ్ కంట మీర్ (సోషలిస్టు యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా- కమ్యూనిస్టు), అరూప్ కలీటా (సీపీఐ) న్యాయ విద్యను అభ్యసించారు. అనూప్ ప్రతిమ్ బోర్‌బారువా (ఎన్‌సీపీ), అమి య కుమార్ హ్యాండిక్యూ (సీపీఐ-ఎం), భూపేన్ నరాహ్ (ఓటర్స్ పార్టీ ఇంటర్నేషనల్) మాస్టర్స్ డిగ్రీ చేశారు.