జాతీయ వార్తలు

మోదీ కుళ్లు రాజకీయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీఘర్, ఏప్రిల్ 14: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కుళ్లు రాజకీయాలకు పాల్పడుతున్నారని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ధ్వజమెత్తారు. జలియన్‌వాలా బాగ్ నరమేధం ఘటన వందేళ్లు పూర్తయిన సందర్భంగా శనివారం జరిగిన కార్యక్రమానికి పంజాబ్ ముఖ్యమంత్రి హాజరుకాకపోవడాన్ని ప్రధాని మోదీ జమ్మూ-కాశ్మీర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీ సందర్భంగా తప్పుపట్టారు. దీనిపై మండిపడిన పంజాబ్ సీఎం తాను ‘కాంగ్రెస్ పరివార్ భక్తి’ కార్యక్రమంలో నిమగ్నమై ఉండడం వల్లే జరిగిన ఆ రోజు జరిగిన హాజరుకాలేకపోయానని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రోత్సహించాల్సిన కేంద్ర ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. అమృత్‌సర్‌లో శనివారం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన జలియన్‌వాలా బాగ్ శతాబ్ది ఉత్సవాలకు భారత ఉప రాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు హాజరైన విషయాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ కార్యక్రమ నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం తరఫున తగిన సహకారం కావాలని గత రెండేళ్లకాలంలో తాను ఎన్నోసార్లు ప్రధానమంత్రిని వ్యక్తిగతంగా కలసి విజ్ఞప్తి చేశానని, కానీ ఆశించిన రీతిలో స్పందించలేదని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇపుడు లోక్‌సభకు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని మోదీ ప్రభుత్వం తన సొంత కార్యక్రమంగా భావించేందుకు ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు. ‘జలియన్‌వాలా బాగ్ ట్రస్ట్‌కు ప్రధానమంత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఏమిటో ఈ సందర్భంగా రుజువైంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇదిలావుండగా, జమ్మూ- కాశ్మీర్‌లోని కతువాలో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ ‘కాంగ్రెస్ పరివార్ భక్తి’ (గాంధీ కుటుంబ సేవలో) బిజీగా ఉండడం వల్లే అమృత్‌సర్‌లో జరిగిన జలియన్‌వాలా బాగ్ శతాబ్ది ఉత్సవాలకు పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ బహిష్కరించారని వ్యంగ్యంగా అన్నారు.