జాతీయ వార్తలు

వారి పొత్తును ప్రజలు నమ్మరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: ముంబయి నగర పరిధిలోని ఆరు లోక్‌సభ సీట్లను కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి సులభంగా గెల్చుకుంటుందని, ప్రభుత్వ వ్యతిరేకతే దీనికి ప్రధాన కారణమని, బీజేపీ- శివసేన అవకాశవాద పొత్తును నమ్మి మరోసారి మోసపోకూడదని ప్రజలు గట్టిగా నిర్ణయించుకున్నారని ముంబయి కాంగ్రెస్ అధ్యక్షుడు మిలింద్ డియోరా అన్నారు. గత నెలలో సంజయ్ నిరూపమ్ స్థానంలో ముంబయి కాంగ్రెస్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన ఆదివారం పీటీఐతో మాట్లాడుతూ ముంబయి కాంగ్రెస్ కమిటీ ఐకమత్యంగా ఉందని, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేస్తూ, ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్నట్టు చెప్పారు. అప్పటి పరిస్థితులకు అనుకూలంగా 2014 ఎన్నికల్లో ఫలితాలు తమ పార్టీకి వ్యతిరేకంగా వచ్చిన మాట వాస్తవమేనని అంగీకరించిన ఆయన ఐదేళ్ల తర్వాత ఇప్పుడంతా బీజేపీ వ్యతిరేక గాలే వీస్తోందని అన్నారు. 2009లో ముంబయి నగర పరిధిలో ఆరు సీట్లకు ఐదు గెల్చుకున్న కాంగ్రెస్ 2014 ఎన్నికల్లో కనీసం బోణి కూడా కొట్టలేకపోయింది. ఆ ఎన్నికల్లో బీజేపీ, శివసేన చెరో మూడు సీట్లను గెల్చుకున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో ముంబయి దక్షిణం నుంచి తిరిగి పోటీ చేస్తున్న డియోరా ఆరు సీట్లలోనూ కాంగ్రెస్ మంచి అభ్యర్థులను పోటీకి దించిందని చెప్పారు. గత ఎన్నికల్లో మోదీ గాలి వీచడంతో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారని, ప్రస్తుతం పరిస్థితులు మారాయని ఆయనకంతా వ్యతిరేకతే కన్పిస్తోందని, దానికి తోడు తమ పార్టీ అభ్యర్థులు నిత్యం ప్రజలతో సత్సంబంధాలు నెరపుతూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నారని చెప్పారు. దీంతో ఈ ఎన్నికల్లో ప్రజల నుంచి తమకు అనూహ్య స్పందన వస్తోందని, గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రభుత్వంపై ప్రస్తుత ఎంపీలపై ప్రజల్లో వ్యతిరేకత బాగా ఉందని, అందుకే ఆరు సీట్లలో తాము విజయం సాధించబోతున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఎన్నికల ముందు శివసేన-బీజేపీ మధ్య తిరిగి పొత్తు ఏర్పర్చుకోవడం వల్ల కాంగ్రెస్‌కు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయా? అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ 2014లో కూడా ఈ రెండు పార్టీలు రంగంలో ఉన్న విషయాన్ని మనం మరువరాదన్నారు. గత ఐదు సంవత్సరాలుగా బీజేపీపై శివసేన విమర్శలు చేయగా, శివసేనను బీజేపీ పలుసార్లు అవమానించిందని ఆయన చెప్పారు. ఐదేళ్లూ కలహాల కాపురం చేసిన రెండుపార్టీలు తీరా ఎన్నికల ముందు కలిసిపోయామని చెబితే నమ్మటానికి ప్రజలేమీ అమాయకులు కాదని అన్నారు. వారి పొత్తు కేవలం అవకాశం వాదంతోనే ఏర్పర్చుకున్న సంగతిని వారు గ్రహించారన్నారు. ముంబయి ఉత్తర లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున నటి ఊర్మిళను పోటీకి దింపడాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఊర్మిళ అభిమానుల్లో గుర్తింపు పొందిన నటి అని, పైగా ఆమెకు సామాజిక స్పృహ, ప్రజల సమస్యలపై స్పందించే గుణం ఉందని, ఇందువల్లే ఆమెను అక్కడ పోటీలో ఉంచినట్టు తెలిపారు.
కాగా ముంబయి-నార్త్ సెంట్రల్ నుంచి ప్రియాదత్, ముంబయి సౌత్-సెంట్రల్ నుంచి ఏక్‌నాథ్ గైక్వాడ్, ముంబయి నార్త్ వెస్ట్ నుంచి సంజయ్ నరుపమ్, నార్త్ ఈస్ట్ నుంచి ఎన్సీపీకి చెందిన సంజయ్ దీన పాటిల్ పోటీ చేస్తున్నారు. ఈ ఆరు నియోజకవర్గాలకు నాలుగో విడతలో ఏప్రిల్ 29న ఎన్నికలు జరుగుతాయి.