జాతీయ వార్తలు

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ జోష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్, ఏప్రిల్ 14: మధ్యప్రదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ బలమైన పవనాలు లేకపోవడంతో పాటు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పొందడం బీజేపీకి ప్రతికూలంగా పరిణమించాయి. అయితే వీటికి భిన్నంగా అసెంబ్లీ ఎన్నికల విజయంతో పాటు మోదీ ప్రభంజనం లేకపోవడాన్ని కాంగ్రెస్ పార్టీ బలంగా వినియోగించుకోబోతున్నది. బీజేపీకి ప్రతికూలతతో పోరాటమైతే కాంగ్రెస్‌కు అన్ని విధాల పరిస్థితి అనుకూలమే. 2014 ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభంజనం కారణంగా ఆ రాష్ట్రంలోని 29 లోక్‌సభ సీట్లలో 27 సీట్లను బీజేపీ దక్కించుకున్నది. కానీ ఇప్పుడు పరిస్థితులు ఆ విధంగా లేవు. సరిగ్గా వంద రోజులు క్రితం ఆ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అనుకూల పవనాలు వీయడంతో బీజేపీ ఖంగు తిన్నది. అంతేకాకుండా బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న 12 లోక్‌సభ సీట్లలో కాంగ్రెస్ అధిక ఓట్లు సాధించింది. మొరీనా, బీహండి, గ్వాలియర్, మండ్ల, చింద్వారా, రాజ్‌గర్త్, దివాస్, రాట్లం, ధార్, ఖర్గోనె, ఖండ్వ, బెతుల్‌లో కాంగ్రెస్ అధిక్యత సాధించింది. 2003 సంవత్సరం నుంచి మధ్య ప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారానికి దూరంగా ఉంది. కాగా గత ఏడాది నవంబర్‌లో ఆ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయదుందుభి మోగించింది. ఇలాఉండగా మధ్యప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి రజనీష్ అగర్వాల్ పీటీఐ వార్తా సంస్థ ప్రతినిధితో మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ 27 లోక్‌సభ స్థానాలను నిలబెట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఇంకా ఎక్కువ సీట్లలో బీజేపీకి విజయం చేకూర్చాలని ప్రజలు కంకణం కట్టుకున్నారని ఆయన తెలిపారు. దేశ ప్రజలు మళ్లీ నరేంద్ర మోదీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని ఆయన చెప్పారు.