జాతీయ వార్తలు

చిక్‌బల్లాపూర్ ఎవరి వశం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిక్‌బల్లాపూర్, ఏప్రిల్ 14: కర్నాటకలోని చిక్‌బల్లాపూర్ లోక్‌సభ నియోజకవర్గం ఇపుడు రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఈ నియోజకవర్గంలో గత 14 ఏళ్లుగా కరవు తీవ్రంగా వేధిస్తోంది. ఫలితంగా రైతులు నానా అవస్థలు పడుతున్నారు. కానీ ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు మాత్రం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఎవరికివారే హామీలను గుప్పిస్తున్నారు తప్ప రైతులు, పేద, మధ్య తరగతి ప్రజల మేలు గురించి పట్టించుకోవడంలేదు. అందుకే ఈసారి జరిగే ఎన్నికల్లో జనం నాడి ఎటు తిరుగుతుందో ఆఖరి నిమిషం వరకు ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించి, రెండుసార్లు పార్లమెంటుకు ఎన్నికైన వీరప్ప మొయిలీ ఈసారి తన భవితవ్యాన్ని మళ్లీ మరోసారి పరీక్షించుకోనున్నారు.
ముఖ్యమంత్రిగా చేసిన అనుభవంతోపాటు ఎంపీగా రెండేళ్లపాటు ప్రజల సమస్యలు తెలుసుకున్న నేతగా, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చరిస్మా తోడై తన గెలుపు సులువు కానుందని ఆయన భావిస్తున్నారు. అదేవిధంగా వీరప్ప మొయిలీకి ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి బచ్చె గౌడ కూడా తన గెలుపుపై భారీ అంచనాలతో ఉన్నారు. ముఖ్యంగా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం గడచిన ఐదేళ్లకాలంలో చేపట్టిన ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తనను గట్టెక్కిస్తాయని బచ్చె గౌడ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ‘సామాన్య జనం పడుతున్న పాట్లను ఎవరూ పట్టించుకోవడం లేదు. మాలాంటి పేదలపై రాజకీయ నాయకులు సానుభూతి కనబరుస్తారనే ఆలోచనే లేదు. ధనికులకే బ్యాంకు రుణాలు, సబ్సిడీలు..మాలాంటి పేదోళ్లు మాత్రం రోజుకు 8-10 గంటలు కష్టపడితే గానీ కడుపునిండా తిండి దొరకదు’ అని తుబగెరె హొబ్లికి చెందిన గౌరమ్మ అనే వ్యవసాయ కూలి పీటీఐ ప్రతినిధి ఎదుట వాపోయింది. బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్న అభ్యర్థి ఎన్నికల ప్రచారం గురించి ఆమె ప్రస్తావిస్తూ యువత అంతా మోదీ..మోదీ అంటూ నినాదాలు చేస్తున్నారని, కానీ ఈనెల 18న తెలుస్తుంది ఎవరు ఎవరికి ఓటు వేస్తారనే విషయం అని ఆమె పేర్కొంది.
పుల్వామా ఘటనకు ప్రతీకారంగా బాలాకోట్‌లో జరిగిన వైమానిక దాడులను పలు సభల్లో ప్రస్తావిస్తూ ముందుకు దూసుకెళ్తున్న బీజేపీ అభ్యర్థి బచ్చె గౌడ ఈ ఎన్నికల్లో 40 ఏళ్ల మధ్య వయసున్న ఓటర్లంతా తమ పార్టీవైపే మొగ్గు చూపుతారని, ఫలితంగా 2014 ఎన్నికల కంటే అత్యధికంగా సీట్లు గెలుస్తామని అంటూ చిక్‌బల్లాపూర్‌లో తన ఎన్నిక ఏకపక్షమే అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఎట్టినహోల్ సమగ్ర నీటి పథకం ప్రాజెక్టును 14 వేల కోట్ల రూపాయల వ్యయంతో పూర్తి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన ప్రజలకు భరోసా ఇస్తున్నారు. అయితే, కాంగ్రెస్ అభ్యర్థి వీరప్ప మొయిలీ సైతం తన గెలుపుపై గట్టి ధీమాను కనబరుస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఇటీవల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మద్దతుగా చేసిన వ్యాఖ్యలను పలు సభల్లో ప్రస్తావిస్తూ అన్నివర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా ఇటీవల పుల్వామా దాడిలో మరణించిన వీరసైనికుల త్యాగాలను బీజేపీ ప్రభుత్వం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఉపయోగించుకుంటున్న అంశాలను సైతం వీరప్ప మొయిలీ పలు సభల్లో జనం దృష్టికి తీసుకెళ్తున్నారు. అదేవిధంగా భారత్‌లో అంతర్భాగమైన కాశ్మీర్‌పై పాకిస్తాన్ జోక్యం చేసుకోవడాన్ని కూడా జనం ముందుకు తీసుకెళ్తుండడంతో వారి నుంచి సైతం అదేరీతిన మద్దతు లభిస్తోందని కాంగ్రెస్ అభ్యర్థి వీరప్ప మొయిలీ పేర్కొంటున్నారు. అదేవిధంగా భారతదేశానికి మళ్లీ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయితేనే ఇరు దేశాల మధ్య ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సరిహద్దు సమస్యలతోపాటు కాశ్మీర్ సమస్యపై ప్రతిష్టంభనకు పరిష్కార మార్గం దొరుకుతుందని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించిన సందర్భాన్ని సైతం వీరప్ప మొయిలీ తన ఎన్నికల ప్రచారంలో ప్రధాన అస్త్రంగా వాడుకుంటున్నారు. అయితే, ఎట్టినహోల్ ప్రాజెక్టు పూర్తికాకపోవడంపై వస్తున్న ఆరోపణలపై ఆయన మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ఇప్పటికే దాదాపు 80 శాతం పూర్తయిందని, మరో 100 కిలోమీటర్ల పని మాత్రమే మిగిలి ఉందని, ఇది కూడా రానున్న రోజుల్లో పూర్తవుతుందని అంటూ ఈ ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతోందంటూ విమర్శలు చేస్తున్న వారు స్వయంగా వచ్చి చూడాలని సవాల్ విసిరారు. అంతేకాకుండా రానున్న ఐదేళ్లలో ఈ ప్రాజెక్టు ద్వారా లోక్‌సభ పరిధిలోకి ప్రజలకు నీటిని అందించిన తర్వాతే తనకు చస్తానని, దీనిని పూర్తి చేయడమే తన ముందున్న ప్రధాన కర్తవ్యమని మొయిలీ పేర్కొన్నారు.