జాతీయ వార్తలు

ముందు తిట్లు.. తర్వాత పొత్తులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథువా, ఏప్రిల్ 14: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికలకు ముందు ఇతర రాజకీయ పార్టీలపై విరుచుకుపడతారని, ఎన్నికల తరువాత తిరిగి అవే పార్టీలతో కూటములు ఏర్పాటు చేస్తారని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు, జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఆదివారం విమర్శించారు. ఆదివారం అంతకు ముందు కథువాలో నిర్వహించిన ఒక ఎన్నికల సభలో మోదీ మాట్లాడుతూ అబ్దుల్లా కుటుంబం (నేషనల్ కాన్ఫరెన్స్), ముఫ్తీ కుటుంబం (పీడీపీ) జమ్మూకాశ్మీర్‌లో మూడు తరాల జీవితాలను నాశనం చేశాయని ఆరోపించారు. మోదీ చేసిన ఈ వ్యాఖ్యలపై మెహబూబా ముఫ్తీ మండిపడ్డారు. ‘ప్రధాని మోదీ ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలపై విరుచుకుపడి, ఎన్నికల తరువాత అవే పార్టీలతో కూటములు కట్టడానికి ఎందుకు తన దూతలను పంపిస్తారు? 1999లో నేషనల్ కాన్ఫరెన్స్‌తో, 2015లో పీడీపీతో ఇలాగే చేశారు. వారు ఆర్టికల్ 370పై ఎందుకు అధికారం చెలాయించాలనుకుంటున్నారు? బీజేపీ తన హానికరమయిన అజెండాతో దేశాన్ని విభజించడానికి ముస్లింలు, ఇతర మైనారిటీలను బహిష్కరిస్తోంది’ అని మెహబూబా ముఫ్తీ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఒక సందేశంలో పేర్కొన్నారు. కథువా సభలో మోదీ మాట్లాడుతూ ‘అబ్దుల్లా కుటుంబం, ముఫ్తీ కుటుంబం జమ్మూకాశ్మీర్‌లో మూడు తరాల జీవితాలను నాశనం చేశాయి. వారిని సాగనంపితేనే రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. వారు తమ వంశస్థులందరినీ రంగంలోకి తీసుకురాగలరు. వారు కోరుకున్నంత, తిట్టగలిగినంత మోదీని తిట్టగలరు. కాని, వారు ఈ జాతిని విభజించలేరు’ అని అన్నారు.