జాతీయ వార్తలు

నిర్మాణాత్మక చర్చలతోనే శాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: భారత్‌లో సార్వత్రిక ఎన్నికల తర్వాత శాంతి, అంతర్గత భద్రతతోపాటు అపరిష్కృతంగా ఉన్న ఎన్నో అంశాలపై జరుగబోయే చర్చలు ఇరు దేశాల మధ్య బంధాలను మరింత ధృడం చేస్తుందనే ఆశాభావాన్ని పాకిస్తాన్ హైకమిషనర్ సోహైల్ మహమూద్ వ్యక్తం చేశారు. బదిలీపై వెళ్తున్న ఆయన ఆదివారం ఇక్కడ పీటీఐ ప్రతినిధితో మాట్లాడుతూ భారతదేశంలో ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల తర్వాత ఉభయ దేశాల మధ్య జరుగబోయే చర్చలు దీర్ఘకాలంగా పరిష్కారం కాని అంతర్గత భద్రత, శాంతి వంటి పలు అంశాల్లో నిర్మాణాత్మక దిశగా సాగేందుకు అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘దౌత్యపరంగా జరిగే చర్చలు, సంభాషణలు అనివార్యం. ఇవి ఇరుగుపొరుగు దేశాల మధ్య బంధాలను మరింత మెరుగుపరుస్తాయి’ అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పుల్వామాలో ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో గల ఉగ్ర శిబిరాలపై భారత్ వైమానిక దాడులకు తెగబడింది. ఇటీవల కాలం వరకు భారత్‌లో పాక్ హైకమిషనర్‌గా పనిచేసిన సొహైల్ మహమూద్ పాకిస్తాన్ విదేశీ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. భారత్-పాక్ దేశాల మధ్య శాంతి, సామరస్యం, అంతర్గత భద్రత వంటి అంశాల్లో మరింత బలపడేందుకు దౌత్యపరమైన చర్చలు మళ్లీ జరగాల్సిన అవసరం ఎంతో ఉందని ఆయన పేర్కొన్నారు. ‘ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనాలని, అంతర్గత భద్రత విషయంతోపాటు శాంతి, సామరస్యం వెల్లివిరిసేందుకు కట్టుబడి ఉండాలి’ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదిలావుండగా, రెండు వారాల కిందట పాకిస్తాన్ తమ జైళ్లలో మగ్గుతున్న 360 ఖైదీలను విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఖైదీల్లో ఎక్కువమంది మత్స్యకారులు ఉన్నారు. అదేవిధంగా పాకిస్తాన్‌లోని బైసాఖి వార్షిక ఉత్సవాల్లో భారత్ తరఫున పాల్గొనేందుకు 2200 మంది సిక్కు యాత్రీకులకు అనుమతి మంజూరు చేసిన విషయాన్ని సొహైల్ మహమూద్ గుర్తు చేశారు.
చిత్రం... సోహైల్ మహమూద్