జాతీయ వార్తలు

జీఎస్‌ఎల్‌వీ 4వ దశకు కేబినెట్ ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: జీఎస్‌ఎల్‌వి నాలుగవ దశ ప్రయోగ కార్యక్రమానికి కేంద్ర మంత్రివర్గం సోమవారం ఆమోదించింది. 2021-2024 మధ్య కాలంలో ఈ కార్యక్రమంలో భాగంగా జీఎస్‌ఎల్‌వి ప్రయోగాలు జరుగుతాయి. ముఖ్యంగా భూగోళానికి సంబంధించిన నావిగేషన్, కమ్యూనికేషన్, రోదసీ పరిశోధనకు సంబంధించి నాలుగవ దశలో భాగంగా ఉపగ్రహ ప్రయోగాలు జరుగుతాయి. నాలుగవ దశకు అవసరమైన నిధుల మొత్తాన్ని రూ.2729.13 కోట్లు విడుదలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇంకా ఐదు భూసమకాలిక శాటిలైట్ వాహనాలను కొనుగోలు చేస్తారు. ప్రతి ఏడాది రెండు శాటిలైట్ల ప్రయోగాన్ని చేపట్టాలన్నది లక్ష్యం. జీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలను 2003 సంవత్సరంలో చేపట్టడం జరిగింది. ఇప్పటి వరకు రెండు దశలు పూర్తయ్యాయి. మూడో దశ ప్రయోగం పురోగతిలో ఉంది. భూగర్భ, ఖనిజ నిక్షేపాల వనరుల పరిశోధనకు గాను ఇండియా-బోల్వియా దేశాల మధ్య సమన్వయ సహకారానికీ సంబంధించి కుదిరిన ఒప్పందానికీ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2019లో బోల్వియాతో ఒప్పందం కుదిరింది. అదేవిధంగా శాస్త్ర-సాంకేతిక రంగాలకు సంబంధించి ఇండియా-బ్రెజిల్ మధ్య 2018లో జరిగిన ఒప్పందానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.