జాతీయ వార్తలు

‘నిర్భయ్’ ప్రయోగం విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలాసోర్: సబ్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి ‘నిర్భయ్’ని భారత్ తొలిసారిగా విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశాలోని చాందీపూర్ అంతరిక్ష పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ)లో గల ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్)లోని కాంప్లెక్స్-3 నుంచి ఈ అత్యాధునిక క్షిపణిని సోమవారం ఉదయం 11.44 నిమిషాలకు విజయవంతంగా ప్రయోగించారు. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ క్షిపణి ఎక్కడి నుంచైనా ప్రయోగించవచ్చు. ‘నిర్భయ్’ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన తర్వాత డీఆర్‌డీఓ ఒక ప్రకటన చేస్తూ ఈ క్షిపణి నిర్ణీత లక్ష్యాన్ని 42 నిమిషాల్లోనే ఛేదించే సత్తా కలిగి ఉంటుందని పేర్కొన్నారు. 2017 నవంబర్ 7న తొలిసారి డీఆర్‌డీఓ ‘నిర్భయ్’ క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది.