జాతీయ వార్తలు

పుర్రె జీవోను నిలిపివేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 31: బీడీ కట్టలపై 85 శాతం పుర్రె హెచ్చరిక గుర్తు జీవో అమలును నిలుపుదల చేయాలని నిజామాబాద్ ఎంపీ కె కవిత డిమాండ్ చేశారు. ఈమేరకు ఆమె కేంద్రానికి లేఖ రాశారు. బీడీ కట్టలపై 85 శాతం నుంచి 50 శాతం హెచ్చరిక గుర్తులు సరిపోతాయని దిలీప్ గాంధీ కమిటీ సిఫార్సు చేసిందని వాటిని పరిగణనలోకి తీసుకునేంతవరకు కేంద్రం తీసుకొచ్చిన జీవో నిలుపుచేయాలని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆరోగ్య మంత్రి జెపి నడ్డాకు రాసిన లేఖలో కవిత స్పష్టం చేశారు. గురువారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడిన ఎంపీ కవిత బీడీ కట్టలపై పుర్రె హెచ్చరిక గుర్తును 50 శాతానికి తగ్గించేలా కమిటీ సిఫార్సులు చేయడానికి ఎంపీలంతా కీలక పాత్ర పోషించారని అన్నారు. లక్షలాది బీడీ కార్మికులు జీవితాలను కాపాడటానికి కృషి చేస్తున్నామని ఆమె చెప్పారు. తెలంగాణ రైతులకు నీళ్లు ఇవ్వడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంత తపన పడతున్నారో శాసనసభలో నీటిప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ నిదర్శనమని కవిత స్పష్టం చేశారు. ఎగువ రాష్ట్రాలు నదులుపై ప్రాజెక్టులు నిర్మిస్తున్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు పట్టించుకోలేదని నిజామాబాద్ ఎంపీ విమర్శించారు. అప్పటి పాలకుల నిర్లక్ష్యం వల్లే రెండు రాష్ట్రాలు నష్టపోయాయని అన్నారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల రీడిజైన్ చేసి రైతులకు నీళ్లు అందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాజెక్టుల రీ డిజైన్‌కి ప్రతిపక్షాలు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.