జాతీయ వార్తలు

ఈసీ దళిత వ్యతిరేకి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపాల్‌గంజ్, ఏప్రిల్ 18: కేంద్ర ఎన్నికల కమిషన్ దళిత వ్యతిరేక ధోరణిని అవలంబిస్తోందని, అందుకే ఈ ఎన్నికలో తాను ప్రచారం చేయకుండా కొన్ని గంటల పాటు నిషేధం విధించిందని బీఎస్పీ అధినేత్రి మాయావతి ధ్వజమెత్తారు. ముఖ్యంగా ఉత్తర భారతంలో దళితుల రాజధానిగా పేరొందిన ఆగ్రాలోనే తన ప్రచారాన్ని అడ్డుకుందని అన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తూ బీజేపీ నేతలు సైన్యం పేరును వాడుకుంటున్నా ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్య తీసుకోకుండా వౌనం వహిస్తుందని మాయావతి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇటీవల ప్రకటించిన ‘న్యాయ్’ పథకాన్ని ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంగా అభివర్ణించారు. ఎన్నికల కమిషన్ తీసుకుంటున్న చర్యలను తప్పుబట్టిన మాయావతి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా బీఎస్పీ అభ్యర్థులను గెలిపించడమే ఈ సమస్యకు పరిష్కారం అని అన్నారు. 48 గంటల పాటు తనపై విధించిన ప్రచార నిషేధం పూర్తి కావడంతో గురువారం ఇక్కడ జరిగిన ఓ ఎన్నికల ర్యాలీలో మాయావతి మాట్లాడారు. దేశంలోని పేదలకు ఏటా 72వేల రూపాయలను అందిస్తామని కాంగ్రెస్ చేసిన వాగ్ధానాన్ని నమ్మే పరిస్థితి లేదని పేర్కొన్న మాయావతి తాము అధికారానికి వస్తే రైతులకు ప్రభుత్వంలోనూ, ప్రైవేట్ రంగంలోనూ పర్మినెంట్ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో తాలు ఎలాంటి మేనిఫెస్టో విడుదల చేయకపోవడానికి కారణం కేవలం వాగ్ధానాల వల్ల ఏమీ జరగదని భావించడమేనని అన్నారు. అభివృద్ధి పనులను చేపట్టడమే తమ ధ్యేయమని పేర్కొన్న ఆమె కాంగ్రెస్, బీజేపీలు ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలను విడుదల చేసి అనంతరం ఆ వాగ్ధానాలను మరచిపోతాయని, చౌకీదార్ నినాదాలేవీ ఈ ఎన్నికల్లో బీజేపీని కాపాడలేవని అన్నారు. బీజేపీ కారణంగానే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు కావడం లేదని అన్నారు. ఈ ఎన్నికల్లో మహిళలందరూ ఓటు హక్కును వినియోగించుకొని బీఎస్పీకి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.
చిత్రం...ఎన్నికల కమిషన్ నిషేధం అనంతరం మళ్లీ ప్రచారంలో పాల్గొన్న బీఎస్పీ అధినేత్రి మాయావతి ఉత్తరప్రదేశ్‌లోని గోపాల్ గంజ్‌లో జరిగిన ఓ ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతున్న దృశ్యం.