జాతీయ వార్తలు

ఆత్మరక్షణ కోసమే వైమానిక దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, ఏప్రిల్ 18: భారత వైమానిక దళాలు ఇటీవల పాకిస్తాన్‌తో జరిపిన రక్షిత దాడిలో ఆ దేశ పౌరుడిగానీ, సైనికుడు గానీ మరణించలేదని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. గురువారం నాడు ఇక్కడ బీజేపీ మహిళా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఆమె 2014 లాగానే బీజేపీ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ కట్టబెట్టాలని పిలుపునిచ్చారు. గతంలో ఎన్డీయే ప్రభుత్వానికి సారథ్యం వహించిన వాజపేయి అనుకున్నవన్నీ సాధించలేకపోవడానికి కారణం ఆయనది సంకీర్ణ ప్రభుత్వం కావడమేనని సుష్మా స్వరాజ్ అన్నారు. పుల్వామా దాడికి ప్రతీకారంగానే పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో గల జైషే మహమ్మద్ శిక్షణా కేంద్రాన్ని భారత వైమానిక దళం ధ్వంసం చేసిందని సుష్మా స్వరాజ్ గుర్తు చేశారు. ఆత్మ రక్షణ కోసమే ఆ లక్షిత దాడులు జరిగాయని, ఇదే విషయాన్ని ప్రపంచ దేశాలకు వివరించడం జరిగిందని తెలిపారు. పాకిస్తాన్ పౌరులకు గానీ, సైనికులకు గానీ ఎలాంటి నష్టం వాటిల్లకుండానే బాలాకోట్‌లోని ఉగ్రవాద కేంద్రాన్ని ధ్వంసం చేయాలని భారత వైమానిక దళానికి ముందుగానే స్పష్టం చేయడం జరిగిందని ఆమె వెల్లడించారు. భారత వైమానిక దళం కూడా అనుకున్నట్టుగానే ఉగ్రవాదులనే హతమార్చి వెనక్కి తిరిగి వచ్చిందని తెలిపారు. ఈ వైమానిక దాడిని ప్రపంచ దేశాలన్నీ బలపరిచాయని గుర్తు చేసిన సుష్మా ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ అగ్ర నేతల్లో ఒకరుగా ఎదిగారంటూ ప్రశంసించారు. 2008లో ముంబైపై దాడి జరిగిన అప్పటి యూపీఏ ప్రభుత్వం ఎలాంటి ప్రతీకార చర్య తీసుకోలేకపోయిందని అన్నారు.