జాతీయ వార్తలు

రైతులకు రక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బదౌన్, ఏప్రిల్ 18: కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. రైతుల శ్రేయస్సు కోసం అవసరమైన అన్ని చర్యలు చేపడతామని గురువారం ఇక్కడ జరిగిన ఓ ర్యాలీలో హామీ ఇచ్చిన రాహుల్ గాంధీ ‘రుణాలు చెల్లించలేని రైతులను ఆర్థికంగా ఆదుకుంటామే తప్ప, వారిని జైలుకి పంపం’ అని స్పష్టం చేశారు. వేలాది కోట్ల రూపాయల మేర బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఎగవేసిన వ్యాపార వేత్తలను పట్టుకుని జైలుకు పంపాల్సింది పోయి, దేశం వదిలి పారిపోయేందుకు కేంద్రం వారికి అవకాశం కల్పించిందని రాహుల్ అన్నారు. అదే 20వేల రూపాయలు రుణం తీసుకుని ఆర్థిక ఇబ్బందులు కారణంగా కట్టలేకపోయిన రైతులను జైలుకు పంపుతున్నారని ధ్వజమెత్తారు. ‘ఇక నుంచి ఇలాంటి పరిస్థితులకు ఆస్కారమే ఉండదు. వేలకోట్ల రుణం తీసుకుని ఎగవేసిన బడా వ్యాపార వేత్తలను పట్టుకుని జైలుకు పంపే వరకు ఏ రైతు ఇలాంటి దుస్థితి ఎదుర్కోబోడు’ అని రాహుల్ అన్నారు. కేంద్రంలో తమ ప్రభుత్వం ఎన్నికైన వెంటనే రైతుల క్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని, రుణాలు చెల్లించలేకపోయిన వారిపై చర్యలు తీసుకోబోమని రాహుల్ తెలిపారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే రైతు రుణాలను మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకున్నామని, ఆ విధంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అమలు చేశామని రాహుల్ తెలిపారు. అలాగే రాజస్థాన్‌కు సంబంధించి కూడా తమ ప్రభుత్వం ఏర్పడిన స్వల్ప వ్యవధిలోనే రైతు రుణాలను మాఫీ చేశామన్నారు. ఈ సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ తీరును ఎండగట్టిన రాహుల్ గాంధీ ‘చౌకీ దార్ చోర్’ అని ఈ రెండు పార్టీల నేతలు ఎప్పుడైనా అన్నారా? అని రాహుల్ ప్రశ్నించారు. ఇందుకు కారణం ఈ రెండు పార్టీల తాళం చెవులు మోదీ చేతులో ఉండడమేనని, అందుకే ఆయనను పల్లెత్తు మాట అనడం లేదని రాహుల్ విమర్శించారు. గత ఐదేళ్లుగా మోదీ ప్రభుత్వం ఉపాధి అవకాశాలను పెంపొందించడంలో విఫలం అయిందని రాహుల్ అన్నారు. ఉపాధి పెరగడం మాట ఎలా ఉన్నా, ఉన్న ఉద్యోగాలు పోయి నిరుద్యోగ సమస్య వెర్రితలలు వేసే పరిస్థితి తలెత్తిందని రాహుల్ తెలిపారు. గత 45 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్ర రూపం దాల్చిందని, ఉపాధి అవకాశాలు దారుణంగా పడిపోయాయని రాహుల్ తెలిపారు. పెద్దనోట్ల రద్దు ద్వారా పేద సొమ్మును మోదీ కైంకర్యం చేశారని విమర్శించిన రాహుల్ ‘ఈ మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీ వెనక్కి తీసుకుని మళ్లీ పేదల బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేస్తుంది’ అని తెలిపారు. తమ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన కనీస ఆదాయ హామీ పథకం అన్ని విధాలుగా పేద కుటుంబాలను ఆదుకుంటుందని స్పష్టం చేశారు. తాము కేంద్రంలో అధికారాన్ని చేపడితే ఏటా 72వేల రూపాయలను పేద కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో వేస్తామని అన్నారు. దీని వల్ల ఇప్పటి వల్ల పేదలకు జరిగిన అన్యాయం తొలగిపోవడమే కాకుండా, వారికి ఆర్థికంగా న్యాయం జరిగే పరిస్థితి ఏర్పడుతుందన్నారు.