జాతీయ వార్తలు

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఏప్రిల్ 19: తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేదా? అన్న సందిగ్ధానికి ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చారు. తమిళనాడు అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తానని రజనీ శుక్రవారం ఆయన స్పష్టం చేశారు. ఇంకా పార్టీ పేరును కూడా ప్రకటించని ఆయన 2021లో జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని పునరుద్ఘాటించారు. ‘అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగితే అప్పుడు’ అంట తన రాజకీయ ప్రవేశంపై శుక్రవారం ఇక్కడ మీడియా ఎదుట జరిగిన సమావేశంలో స్పష్టం చేశారు. అయితే, రాష్ట్రంలోని 38 లోక్‌సభ నియోజకవర్గాలతోపాటు 18 అసెంబ్లీ స్థానాలకు జరుగనున్న ఎన్నికల తర్వాత తన తుది నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిచే పార్టీతో తలపడతారా అన్న మీడియా ప్రశ్నకు సూపర్‌స్టార్ రజనీకాంత్ స్పందిస్తూ ‘అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా పోటీని ఎదుర్కోవడానికి సిద్ధమే’ అని మరోసారి పునరుద్ఘాటించారు. ఇదిలావుండగా, 234 సభ్యులు కలిగిన అసెంబ్లీలో మొదటి విడతగా 18 స్థానాల్లో ఉపఎన్నికలు జరుగున్న నేపథ్యంలో 22 అసెంబ్లీ సెగ్మెంట్ల చేతిలో ఏఐఏడీఎంకే ప్రభుత్వ మనగడ ఆధారపడి ఉంటుంది. ఎండో విడతగా మే 19న మరో నాలుగు అసెంబ్లీ స్థానాల్లో ఉపఎన్నికలు జరుగనున్నాయి. అధికార పార్టీ ఏఐఏడీఎంకేకి అసెంబ్లీలో స్పీకర్ కాకుండా మొత్తం 113 మంది సభ్యుల మద్దతు ఉంది. సాధారణ మెజారిటీ 117తో ఈ పార్టీ గట్టెక్కవచ్చు. అయితే, రాష్ట్రంలోని అందరి కళ్లూ రెండు విడతలుగా ఉపఎన్నికలు జరిగే 22 స్థానాలపై ఆధారపడి ఉన్నాయి. అప్పటివరకు ఏఐఏడీఎంకే ప్రభుత్వానికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకూ ఎలాంటి ఢీకా ఉండదు. ఇదిలావుండగా, 2017 డిసెంబర్‌లో సూపర్‌స్టార్ రజనీకాంత్ తన రాజకీయాల్లో ప్రవేశానికి ఆసక్తి ఉందన్న విషయాన్ని ప్రకటించారు. రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలను ధీటుగా తట్టుకునేందుకు గాను రజనీ రాజకీయ ప్రవేశం ఉంటుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో రావాలనే ఉద్దేశంతోనే రజనీకాంత్ 2017 డిసెంబర్ 31న ‘రజనీ మక్కల్ మండ్రమ్’ అనే ఫోరమ్‌ను ప్రారంభించారు. దీంతో రజనీ రాజకీయ ప్రవేశం ఖాయమని అప్పట్లో ఎంతోమంది ఊహించారు. ఈ ఊహలను నిజం చేస్తూ సూపర్‌స్టార్ తమ పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని తాజాగా వెల్లడించారు. కాగా, నరేంద్ర మోదీ ప్రధానిగా మళ్లీ రెండోసారి ఎన్నికవుతారా? అన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు మే 23న జరిగే ఓట్ల లెక్కింపు రోజున తెలుస్తుందని రజనీకాంత్ పేర్కొన్నారు.