జాతీయ వార్తలు

పీఠాన్ని కాపాడుకునేందుకే తాపత్రయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆగ్రా (యూపీ), ఏప్రిల్ 19: ప్రధానమంత్రి స్థానాన్ని ఎవరైనా ఆక్రమించుకుంటారనే ఆందోళన నరేంద్ర మోదీలో కనబడుతోందని, దీనిని ఎలాగైనా కాపాడుకునేందుకు ఎన్నో రకాల అబద్ధాలను ఆయన ఆడుతున్నారని కాంగ్రెస్ నాయకుడు రాజ్‌బబ్బర్ వ్యాఖ్యానించారు. పార్టీ ఉత్తరప్రదేశ్ విభాగానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న రాజ్‌బబ్బర్ శుక్రవారం ఇక్కడ పీటీఐ ప్రతినిధితో మాట్లాడుతూ గత ఎన్నికల్లో కేవలం రాయ్‌బరేలి, అమేథీలోనే రెండు సీట్లు గెలుపొందిన కాంగ్రెస్ బీజేపీ వాళ్లు ఆరోపిస్తున్నట్టు పూర్తిగా తుడిచిపెట్టుకుపోలేదని, మళ్లీ పుంజుకుంటుందని అన్నారు. ‘ప్రధాని నరేంద్ర మోదీ ఆడుతున్న అబద్ధాలపై ఎలాంటి కామెంట్లు చేయదలచుకోలేదు. ప్రధాని వంటి అతి పెద్ద పదవిలో ఉన్నటువంటి వ్యక్తి తన పదవిని నిలబెట్టుకోవడానికి ఎన్నో అబద్ధాలు ఆడుతూ తనపై విశ్వసనీయతను ప్రశ్నించే స్థాయికి దిగజారుతున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సైతం తిరిగి ప్రశ్నించేలా ఉన్నాయి. ఇదంతా కేవలం తన పీఠాన్ని కాపాడుకోవడానికేనన్న విషయం మీరు అర్ధం చేసుకోవచ్చు’ అని రాజ్‌బబ్బర్ వ్యాఖ్యానించారు. ‘రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో ప్రధాని మోదీని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. దీనిపై మోదీ చేసిన వ్యాఖ్యలే ఎన్ని అబద్ధాలు చెప్పారో విశదమైంది. కేవలం స్వీయరక్షణకే ఆయన తాపప్రయపడుతున్నారు’ అని ఆయన పేర్కొన్నారు. ఇదిలావుండగా ప్రజల్లో మమేకం అవుతున్న నాయకులు మాట్లాడేందుకు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుందని, అసందర్భమైన, అనుచితమైన భాషతో ప్రత్యర్థి వర్గాలపై విరుచుకుపడాన్ని నియంత్రించుకోవాల్సిన అవసరం ఉందని పరోక్షంగా మోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
‘ఉన్నత స్థానంలో ఉన్న నాయకులు ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడే ముందు అసభ్యకరమైన భాషను ఉపయోగించడాన్ని నిరోధించేందుకు ప్రతిఒక్కరూ పోరాడాలి’ అని రాజ్‌బబ్బర్ పిలుపునిచ్చారు. ఇక్కడి ప్రజల గుండెల్లో కాంగ్రెస్ పార్టీ నిలిచి ఉందని, పార్టీపై ప్రజలకు ఎంతో విశ్వాసం ఉందని అన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతోపాటు ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటుండడంతో తన గెలుపు సులువు అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.