జాతీయ వార్తలు

బెంగాల్‌లో బీజెపీకి ‘రసగుల్లా’నే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంగారాంపూర్ (పశ్చిమ బెంగాల్), ఏప్రిల్ 19: పశ్చిమ బెంగాల్‌లో భారీ సంఖ్యలో లోక్‌సభ స్థానాలను గెలుచుకుంటామన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆశలు పగటి కలలేనని రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీకి వచ్చేది పెద్ద ‘జీరో’నేని శుక్రవారం ఇక్కడ జరిగిన ఎన్నికల ర్యాలీలో మమత అన్నారు. ప్రజలకు రెండు చేతుల్లోనూ లడ్డూలు ఇస్తానంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ ఎప్పటికీ నెరవేరే అవకాశం లేదని, రాష్ట్రంలో మోదీకి ఈ సారి అందేది ‘రసగుల్లా’ (జీరో)నేనని మమత వ్యంగ్యోక్తి విసిరారు. ‘్ఢల్లీకో లడ్డూ జో కాయా, వో పస్తాయా..’ (్ఢల్లీ లడ్డు ఎవరు తింటి వారికి విచారమే మిగులుతుంది) అంటూ హిందీ సామెతను ఉటంకించిన మమతా బెనర్జీ, బెంగాల్‌లో మాత్రం బీజేపీ ఆశలు ఎంత మాత్రం ఫలించే అవకాశం లేదని పునరుద్ఘాటించారు. 2016 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మోదీ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసిన మమతా బెనర్జీ తనదైన శైలిలోనే ప్రతిస్పందించారు. రాష్ట్రంలోని 42 లోక్‌సభ స్థానాల్లో కనీసం 21 స్థానాలను గెలుచుకోవాలిన బీజేపీ ఆశిస్తున్నదని పేర్కొన్న మమత ‘2014లో ఆ పార్టీకి రెండు సీట్లు వచ్చాయి, ఈ సారి అవి కూడా రావు..’ అని అన్నారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా బీజేపీకి వచ్చే సీట్లు వందకు మించవని ఆమె స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లో 73 స్థానాలు గెలుపొందిన బీజేపీకి ఈసారి 13 సీట్లు రావడం కూడా కష్టమేనని అన్నారు. ఈశాన్య భారతం, ఒరిస్సాలోనూ బీజేపీకి ఒక్క సీటు కూడా రాకపోవచ్చునని జోస్యం చెప్పారు. ఈసారి పశ్చిమ బెంగాల్ ఫలితాలు ఆశ్చర్యం కలిగించే రీతిలో ఉంటాయంటూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తిప్పి కొట్టిన మమత ‘అవును, బీజేపీకి ఒక్క సీటు కూడా రాష్ట్రం నుంచి రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించేదే..’ అని వ్యాఖ్యానించారు. ‘్ఛయ్‌వాలా‘ ప్రధాని మోదీకి అరుణ్ జైట్లీ ‘కెటిల్’ ఆర్థిక మంత్రి అని వ్యంగ్యంగా అన్నారు. ఐదేళ్ళ క్రితం తాను ఛాయ్‌వాలానని జనం ముందుకు వచ్చిన మోదీ, ఇప్పుడు చౌకీదార్ అంటూ కొత్త అవతారం ఎత్తారు, ఎన్నికల్లో ఓడిపోతే ఆయనకు మిగిలేది ‘చౌకీనే’నని అన్నారు. బెంగాలీ భాషలో ‘చౌకీ’ అంటే మంచం అని అర్థం. రాష్ట్రంలో జరిగిన రెండు దశల లోక్‌సభ ఎన్నికల్లో ఐదు సీట్లలో తమ పార్టీయే గెలుపొందుతుందని, ‘నరేంద్ర మోదీ మళ్లీ ఎన్నికైతే ప్రజలకు వాక్ స్వాతంత్య్రమే ఉండదు’ అని హెచ్చరించారు.