జాతీయ వార్తలు

‘న్యాయ్’తో ఆర్థిక న్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘాజీపురా (గుజరాత్), ఏప్రిల్ 19: దేశంలోని పేదల ఖాతాల్లో ఏటా రూ.72 వేలు మేర కనీస ఆదాయాన్ని సమకూర్చాలన్న తమ పార్టీ పథకం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడం సాధ్యమవుతుందని, అలాగే దీని వల్ల ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. పెద్ద నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను (జీఎస్‌టి) వంటి నిర్ణయాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని, అలాగే ఉపాధి అవకాశాలు కూడా అడుగంటిపోయయాని శుక్రవారం ఇక్కడ జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ అన్నారు. ‘చౌకీదార్ చోర్ హై’ అన్న తన నినాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చిన రాహుల్ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డారు. వ్యాపార వేత్త అనిల్ అంబానీకి రూ.30 వేల కోట్లు ప్రధాని మోదీ దోచి పెట్టారని, రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలే ఇందుకు నిదర్శనమని ఆయన ఆరోపించారు. ‘న్యాయ్’ పథకం ద్వారా దేశంలోని పేదలకు ఏటా రూ.72 వేలు కనీస ఆదాయంగా అందించాలన్న తమ నిర్ణయం వల్ల పేదల స్థితి గతులు గణనీయంగా మెరుగు అవుతాయని ఈ సందర్భంగా రాహుల్ తెలిపారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో న్యాయ నినాదంతోనే కాంగ్రెస్ పార్టీ బలంగా ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. పార్టీలోని సీనియర్ నేతలను, ఇతర నిపుణులను సంప్రదించిన మేరకే తాము ఈ పథకాన్ని తీసుకుని వచ్చామని, అలాగే ఆర్థిక వేత్తలను కూడా సంప్రదించి వారి అభిప్రాయాలూ తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. ఏటా రూ.72 వేలను దేశంలోని పేదల ఖాతాల్లోకి జమ చేసి, వారి స్థితిగతులు మెరుగయ్యే అవకాశం ఉందని నిపుణులు వ్యక్తం చేశారని అన్నారు. 2014 ఎన్నికల ముందు నరేంద్ర మోదీ ఎన్నో హామీలు ఇచ్చారని, రూ.15 లక్షలను ప్రజల బ్యాంకు ఖాతాల్లో వేస్తామని చెప్పారని గుర్తుచేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏటా రూ.72 వేల కనీస ఆదాయ పథకాన్ని ఖచ్చితంగా అమలు చేస్తుందని, ఇందుకు అయ్యే మొత్తాన్ని సమకూర్చుకుంటుందని ఆయన తెలిపారు.
2016లో పెద్ద నోట్లను రద్దు చేయడం ద్వారా మోదీ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందని, రూ.500, వెయ్యి నోట్ల ద్వారా ఎక్కువ నల్లధనాన్ని సృష్టించే అవకాశం ఉంది కాబట్టి వాటిని రద్దు చేసి, వాటి స్థానే రెండు వేల నోటును తీసుకుని వచ్చారని రాహుల్ ఎద్దేవా చేశారు. అలాగే మోదీ ప్రభుత్వం అమలు చేసిన జీఎస్‌టి కూడా అనాలోచిత నిర్ణయమని, దీంతో పాటు పెద్ద నోట్ల రద్దు కూడా దేశ ఆర్థిక వ్యవస్థను ఘోరంగా దెబ్బ తీసిందని ఆయన విమర్శించారు. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయిందని, ఫలితంగా అనేక కంపెనీలు మూత పడ్డాయని రాహుల్ తెలిపారు. దీని ఫలితంగానే దేశంలో నిరుద్యోగం గత కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా 45 శాతానికి పెరిగిపోయిందని తెలిపారు. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే అమలు చేసే న్యాయ పథకం వల్ల పరిస్థితులు చక్కబడుతాయని, ఉపాధి అవకాశాలు ఇనుమడిస్తాయని ఆయన చెప్పారు. ప్రజల బ్యాంకు ఖాతాల్లోకి ఈ మొత్తం జమ కావడం వల్ల వారి కొనుగోలు శక్తి పెరుగుతుందని, అన్ని కంపెనీల ఉత్పత్తులకు డిమాండ్ కూడా పెరిగి ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిలో పడుతుందన్నారు. కేవలం కొంత మంది పారిశ్రామికవేత్తల కోసమే మోదీ సర్కారు పని చేస్తున్నదని చెప్పిన రాహుల్ ‘ఇలాంటి చౌకీదార్’ మనకు అవసరమా? అని ప్రజలనుద్ధేశించి ప్రశ్నించారు. ఈ చౌకీదార్ అంబానీకి చౌకీదార్ అని పేర్కొన్న ఆయన రైతుల ఇళ్ళకు ఎలాంటి చౌకీదార్ అవసరం లేదన్నారు. రైతుల రుణాలను మాఫీ చేసేందుకు మోదీ వద్ద డబ్బులు లేవని, అదే వేల కోట్ల రుణాలు తీసుకుని బడా వ్యాపారవేత్తలను రుణాలను మాఫీ చేసేందుకు మాత్రం ఆయన వద్ద డబ్బులు ఉంటాయని రాహుల్ వ్యంగ్యోక్తి విసిరారు.