జాతీయ వార్తలు

ఏమిటీ మీ సంకేతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కత్తా, ఏప్రిల్ 19: ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పని చేస్తున్నది బీజేపీకి వ్యతిరేకంగానా లేక వామపక్షాలను ఎదుర్కొనేందుకా? అని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రశ్నించారు. ఈ విషయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన వైఖరిని స్పష్టం చేయాలని కేరళలోని వాయనాడ్ నుంచి ఆయన పోటీ చేయడం విభిన్న సంకేతాలను అందిస్తున్నదని ఏచూరి అన్నారు. రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయం వల్ల ఈ రెండు పార్టీలు ఎన్నికల అనంతరం కలిసి పని చేసే అవకాశాన్ని నివారించలేవని ఆయన స్పష్టం చేశారు. ఇందుకు ఉదాహరణగా 2004 జాతీయ రాజకీయ పరిణామాలను ఏచూరి ఉదహరించారు. అప్పట్లో కాంగ్రెస్ సారథ్యంలోని యుపీఎకు వామపక్షాలు బయట నుంచి మద్దతునిచ్చిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అప్పట్లో తాము 61 సీట్లను గెలుచుకున్నామని, వాటిలో 57 స్థానాలు కాంగ్రెస్ పార్టీని ఓడించి సాధించుకున్నవేనని ఏచూరి గుర్తు చేశారు. ప్రస్తుతం కేరళలోని 20 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ సారధ్యంలోని యుడీఎఫ్, వామపక్షాల సారథ్యంలోని ఎల్‌డీఎఫ్ మధ్య పోటీ జరుగుతున్నదన్నారు. రాహుల్ గాంధీ చెప్పినా, మరొకరు చెప్పినా ప్రస్తుతం బీజేపీని ఓడించడమే దేశానికి అత్యంత కీలకమని ఓ ఇంటర్వ్యూలో ఏచూరి స్పష్టం చేశారు. వాయనాడ్ నుంచి పోటీ చేయడం ద్వారా ఏ రకమైన సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారో రాహుల్ గాంధీకే తెలియాలని అన్నారు.
గతంలో కాంగ్రెస్ కుటుంబీకులెవరూ వామపక్షాలపై పోటీ చేయలేదని కర్నాటక నుంచి వారు పోటీ చేశారని ఆయన గుర్తు చేశారు. అయితే రాహుల్ గాంధీ తన పోరాటం బీజేపీపైనా లేక వామపక్షాలపైనా అనేది తేల్చి చెప్పాల్సి ఉందన్నారు. గతంలో ఇందిరా గాంధీ 1978లో చిక్‌మగలూరు నుంచి 1999లో సోనియా గాంధీ బళ్ళారి నుంచి బీజేపీపైనే పోటీ చేసిన విషయాన్ని ఏచూరి గుర్తు చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా పని చేయడం ఒక ఎత్తు అయితే వామపక్షాలపైనే కాంగ్రెస్ పోటీ చేయడం పూర్తి భిన్నమైన సంకేతాలు అందించడమే అవుతుందని ఏచూరి అన్నారు. సమైక్య భారతం అన్న సందేశాన్ని ఇవ్వాలనుకుంటే ఆయన తమిళనాడు నుంచో లేదా కర్నాటక నుంచి పోటీకి దిగి ఉండవచ్చునని ఏచూరి అభిప్రాయపడ్డారు. వాయనాడ్ నుంచి రాహుల్ పోటీ చేయడం ద్వారా ఎన్నికల అనంతరం ఢిల్లీలో చోటు చేసుకునే పరిణామాలకు సంబంధించి ప్రభావం చూపుతుందా? అప్పటి పరిస్థితులను బట్టి కాంగ్రెస్ పార్టీకి వామపక్షాల మద్దతుకు అవరోధం అవుతుందా? అన్న ప్రశ్నకు ‘ఎందుకు అవరోధం అవుతుంది?, రాహుల్ పోటీ చేయకపోతే, మరో కాంగ్రెస్ అభ్యర్థి అక్కడ ఉంటారు, ఎందుకంటే కేరళలో కాంగ్రెస్‌ను మేము రాజకీయంగా ఎదుర్కొంటున్నాం..’ అని ఏచూరి స్పష్టం చేశారు.
2000 నాటి జాతీయ రాజకీయ పరిస్థితులు ఉదహరించిన ప్రస్తుత ఎన్నికల్లో లౌకిక ప్రజాస్వామ్య ప్రభుత్వమే కేంద్రంలో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఎన్నో సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పటికీ భారత దేశ భవితవ్యాన్ని నిర్ధేశించే కీలక ప్రాధాన్యత ఈ ఎన్నికలకు ఉందన్నారు.