జాతీయ వార్తలు

హజ్ యాత్రకు లైన్ క్లియర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: భారత్ నుంచి హజ్ యాత్రకు వెళ్లే యాత్రీకుల కోటాను పెంచడంతో వారి యాత్రకు లైన్ క్లియర్ అయ్యిందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం నాడు తెలిపింది. ఈ ఏడాది హజ్ యాత్రకు భారత్‌లోని పెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, బీహార్ రాష్ట్రాల నుంచి దాదాపు రెండు లక్షల మంది వెళ్లేందుకు ఉద్దేశించిన కోటాను సౌదీ అరేబియా అంగీకరించడంతో ఈ యాత్రీకుల ప్రయాణానికి మార్గం సుగమం అయింది. సౌదీ రాజు ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వి తదితరులు ఈ ఏడాది ఫిబ్రవరిలో సౌదీ అరేబియాలో సమావేశమైన విషయం తెలిసిందే. హజ్ యాత్రకు వెళ్లే యాత్రీకుల సంఖ్యను పెంచాలని ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చింది. భారత్ నుంచి హజ్‌కు వెళ్లేవారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఈ సంఖ్యను కనీసం 2 లక్షల వరకు పెంచాలనే ప్రతిపాదన వచ్చింది. ‘్భరత్‌లోని పెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, బీహార్‌తోపాటు అండమాన్ నికోబార్ దీవులు, దాద్రా అండ్ నగర్ హవేలి, గోవా, మణిపూర్, లక్షద్వీప్, ఒడిశా, పాండిచ్చేరి, ఆంధ్రప్రదేశ్, అస్సాం, చండీఘ్ఢ్, దమన్ అండ్ డయ్యూ, హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్, త్రిపుర తదితర రాష్ట్రాల నుంచి అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి’ అని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఎలాంటి సబ్సిడీ లేకుండానే ఈ ఏడాది రికార్డు స్థాయిలో రెండు లక్షల మంది ముస్లింలు హజ్ యాత్రకు వెళ్లనున్నారు. వీరిలో 2340 మహిళలు కూడా ఉండడం విశేషం. 2014లో 1.36 లక్షల మంది హజ్ యాత్రకు వెళ్లారు.