జాతీయ వార్తలు

గృహ ఇంధనాలతోనే వాయుకాలుష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: దేశంలో ఇళ్లలో వినియోగిస్తున్న కర్రలు, పేడ, బొగ్గు, కిరోసిన్ వంటి మలిన ఇంధనాల వల్ల వెలువడుతున్న ఉద్గారాలను నివారిస్తే వాయు కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించడంతో పాటు ఏటా సుమారు 2,70,000 మంది ప్రజల ప్రాణాలను కాపాడవచ్చని ఐఐటీ ఢిల్లీకి చెందిన పరిశోధకులు చేసిన తాజా అధ్యయనం వెల్లడించింది. పారిశ్రామిక యూనిట్లు, వాహనాల నుంచి వెలువడుతున్న ఉద్గారాలలో ఎలాంటి మార్పులు చేయకపోయినా కేవలం ఇళ్లలో కర్రలు, పేడ, బొగ్గు, కిరోసిన్ వంటి మలిన ఇంధనాల ఉపయోగాన్ని మానివేసి, ఉద్గారాలు వెలువడకుండా చూసుకుంటే సరాసరి వాయు కాలుష్యం స్థాయి దేశ వాయు నాణ్యత ప్రమాణం కన్నా దిగువకు తగ్గుతుందని ఆ అధ్యయనం వివరించింది. ప్రొసీడింగ్స్ ఆఫ్ ద నేషనల్ అకాడమి ఆఫ్ సైనె్సస్ అనే జర్నల్‌లో ఆ అధ్యయ నం వివరాలు ప్రచురితమయ్యాయి. ఇళ్లలో మలిన ఇంధనాల వినియోగాన్ని తగ్గించడం వల్ల దేశంలో వాయు కాలుష్యం కారణంగా సంభవిస్తున్న మరణాలలో సుమారు 13 శాతా న్ని తగ్గించవచ్చని, అంటే సాలీనా సుమారు 2,70,000 ప్రాణాలను కాపాడవచ్చని పరిశోధకులు తెలిపారు. 3్భరత్‌లో వాయు కాలుష్యానికి ఇళ్లలో వినియోగించే మలిన ఇంధనాలే ఏకైక అతి పెద్ద కారణం2 అని అమెరికాలోని బెర్కెలిలో గల యూనివర్శిటి ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన ప్రొఫెసర్ కిర్క్ ఆర్ స్మిత్ తెలిపారు. 3ఇళ్లలో మలిన ఇంధనాల వినియోగాన్ని ఆపివేస్తే ఏమవుతుందనే అంశాన్ని మేము పరిశీలించాం. అలా చేసినట్లయితే దేశంలో వాయు కాలుష్య స్థాయిలు జాతీయ వాయు నాణ్యత ప్రమాణాల కన్నా దిగువకు తగ్గుతాయి2 అని స్మిత్ ఒక ప్రకటనలో తెలిపారు.