జాతీయ వార్తలు

కాంగ్రెస్‌కు చతుర్వేది రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, పార్టీ మీడియా సెల్ కన్వీనర్ ప్రియాంక చతుర్వేది పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తనపట్ల అసభ్యకరంగా వ్యవహరించిన కొంతమంది కార్యకర్తలకు పార్టీలోకి మళ్లీ తీసుకోవడం పట్ల ఆగ్రహానికి గురైన ఆమె ఏకంగా కాంగ్రెస్‌ను వీడుతున్నట్టు ప్రకటించారు. పార్టీలో వివిధ పదవుల్లో కొనసాగుతున్న ప్రియాంక చతుర్వేది తన రాజీనామా పత్రాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి, పార్టీ సీనియర్ నాయకులకు ట్విట్టర్ ద్వారా తెలియజేసినట్టు స్పష్టం చేశారు. కాంగ్రెస్ రాజీనామా చేసిన ప్రియాంక చతుర్వేది త్వరలో శివసేన పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. ‘పార్టీలో గొప్ప సేవలు అందించాను. ఇందుకు పార్టీ నుంచి లభించిన అభిమానం, ప్రేమ, మద్దతు గొప్పవి. ఈ తరహా మద్దతు, ఆదరణ వల్లే ఇంతటి అభిమానం పొందగలిగాను. పార్టీలో ఇప్పటివరకు అందించిన సేవల్లో సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు’ అని ప్రియాంక చతుర్వేది మరో ట్వీట్ ద్వారా పేర్కొన్నారు. ‘మహిళల భద్రత, గౌరవం, సాధికారత వంటి అంశాల్లో మీరు పిలుపునిచ్చారు. కానీ కొందరు పార్టీ సభ్యులపై అది చర్య తీసుకునే దిశగా ముందుకు సాగలేదు. ముఖ్యంగా అధికారికరికంగా విధులు నిర్వహించిన నాలాంటి వారిపై పార్టీలోని కొందరు వ్యక్తులు వ్యవహరించిన తీరు తీవ్రంగా బాధించింది. ఇలాంటి కార్యకర్తల వైఖరి చివరకు నాలాంటి వారు పార్టీని వీడేలా చేసింది’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

పార్టీకి తాను చేసిన రాజీనామాను అంగీకరించాలని, ఇంతవరకు పార్టీలో అనుభవించిన వివిధ పోస్టుల బాధ్యతల నుంచి విముక్తి చేయాలని ఆయన కోరారు. ఉత్తరప్రదేశ్‌లోని మథురలో ఇటీవల జరిగిన ఒక మీడియా సమావేశం సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు ప్రియాంక చతుర్వేది పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతోపాటు బెదిరింపు ధోరణులకు దిగారు. ఈ విషయాన్ని ఆమె పార్టీ అధిష్టానం దృష్టికి సైతం తీసుకెళ్లింది. అయినా వారినే నాయకులు వెనకేసురావడంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఆమె చివరకు పార్టీనే వీడుతున్నట్టు ప్రకటించారు.