జాతీయ వార్తలు

మెజారిటీ వస్తే ఆర్టికల్ 370 రద్దే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధరంపూర్/ ఛోటా ఉదేపూర్ (గుజరాత్), ఏప్రిల్ 19: పార్లమెంటు ఉభయ సభల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి మెజారిటీ వస్తే జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370వ అధికరణాన్ని రద్దు చేస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. గుజరాత్‌లోని వల్సద్ జిల్లా ధరంపూర్‌లో శుక్రవారం ఒక ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. ప్రస్తుతం కొనసాగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ ప్రధాన ప్రచారాంశం జాతీయ భద్రత అని ఆయన పేర్కొన్నారు. ‘మా పార్టీకి లోక్‌సభ, రాజ్యసభలో మెజారిటీ వస్తే ఆర్టికల్ 370ని రద్దు చేస్తామని మేము ఇదివరకే మా పార్టీ ఎన్నికల ప్రణాళికలో చెప్పాం. దీంతో జమ్మూకాశ్మీర్ భారత్‌లో అంతర్భాగం అవుతుంది’ అని అమిత్ షా అన్నారు. ఇదిలా ఉండగా, దేశాన్ని అయిదు దశాబ్దాలకు పైగా పాలించిన కాంగ్రెస్ పార్టీ ఆ కాలంలో పేదరిక నిర్మూలన కోసం ఏం చేసిందనే అంశంపై ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తమ పార్టీ యువజన మోర్చా అధ్యక్షుడితో బహిరంగ చర్చకు రావాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సవాలు విసిరారు. శుక్రవారం ఛోటా ఉదేపూర్‌లో ఒక ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం అయిదేళ్ల కాలంలో సాధించిన విజయాలను వివరించారు.
బీజేపీ పాలి త గుజరాత్‌లో అభివృద్ధి కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ అడ్డుపడుతోందని ఆయన ఆరోపించారు. ‘రాహుల్ బాబా పేదల గురించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ ‘గరీబీ హటావో’ (పేదరిక నిర్మూలన’ నినాదం ఇస్తోంది. అయిదు తరాలు, 55 ఏళ్ల పాటు కేవలం మీ కుటుంబమే దేశాన్ని పాలించింది. మీరు పేదలకోసం ఏం చేశారనే వివరాలతో వడోదరలోని ఏ కూడలికి అయినా రండి. మీరు చెప్పే వివరాలపై మా యువజన మోర్చా అధ్యక్షుడు స్పందిస్తారు’ అని అమిత్ షా రాహుల్ గాంధీని ఉద్దేశించి అన్నారు. రాహుల్ గాంధీ అనేకసార్లు అవినీతిపై, ప్రత్యేకించి రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై, పెద్ద నోట్ల రద్దుపై బహిరంగ చర్చకు రావలసిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సవాలు విసిరారు. ఈ నేపథ్యంలో అమిత్ షా శుక్రవారం రాహుల్ గాంధీకి సవాలు విసిరారు. ‘అయిదు తరాల పాటు మీరు (కాంగ్రెస్) పేదలు, గిరిజనులు, దళితులు, రైతులు, గ్రామీణుల పేరిట ఓట్లు అడిగారు. కాని, వారి అభివృద్ధి కోసం ఏమీ చేయలేదు’ అని అమిత్ షా అన్నారు. మోదీ ప్రభుత్వం దేశంలో పేదరిక నిర్మూలన కోసం అనేక చర్యలు తీసుకుందని ఆయన పేర్కొన్నారు.