జాతీయ వార్తలు

దేశానికి ఇవి చెడ్డ రోజులు: మోహబూబా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, భారత దేశం అత్యంత తీవ్రమైన గడ్డు రోజులు ఎదుర్కొంటున్నదని కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మోహబూబా ముఫ్తీ ఆవేదన వ్యక్తం చేశారు. 2008 నాటి మాలేగావ్ పేలుళ్ళ కేసులో నిందితురాలు, భోపాల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సాద్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ యాంటీ టెర్రరిస్టు స్వ్కాడ్ హేమంత్ కర్కారేపై చేసిన వ్యాఖ్యలనుద్ధేశి ముఫ్తీ మాట్లాడారు. హేమంత్ కర్కారే వంటి త్యాగధనులపై అత్యంత హేయమైన రీతిలో విమర్శలు చేసే వ్యక్తులను ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబెట్టడం అనేది గడ్డు రోజులకు నిదర్శమని ఆమె పేర్కొన్నారు. మాలేగావ్ కేసులో ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న ప్రజ్ఞను ‘మోకా‘ అభియోగాల నుంచి ఒక కోర్టు విముక్తిరాలిని చేసింది.
అయితే ఇప్పటికీ కొన్ని తీవ్ర నేరాల కింద ఆమె విచారణ ఎదుర్కొంటున్నారు. ప్రజ్ఞా ఠాకూర్ వంటి అభ్యర్థులను ఎన్నికల్లో నిలబెట్టడం ద్వారా ప్రజలకు ఏ రకమైన సందేశాలు ఇవ్వాలని బీజేపీ అనుకుంటున్నదని మెహబూబా ప్రశ్నించారు. దీనిని బట్టి చూస్తే ప్రజ్ఞా ఠాకూర్ అభిప్రాయాలను బీజేపీ బలపరుస్తున్నదన్న వాదనకు బలం చేకూరుతున్నదని అన్నారు.