జాతీయ వార్తలు

మోదీపై పోటీ మాటలా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: వారణాసిలో ప్రధాన మంత్రి నేరంద్ర మోదీపై ప్రియాంకను పోటీకి నిలబెట్టాలా.. వద్దా? అనే అంశంపై కాంగ్రెస్‌లో తర్జనభర్జనలు జరుగుతున్నాయి. నరేంద్ర మోదీపై ప్రియాంక పోటీ చేస్తుందని ఇటీవల కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేయటం తెలిసిందే. నరేంద్ర మోదీపై తాను పోటీ చేయాలా.. వద్దా? అనేది ప్రజలే చెప్పాలని ప్రియాంక కొంతకాలం క్రితం వారణాసిలో చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఈ అంశంపై స్పష్టత ఇవ్వటం లేదు. రెండు రోజుల క్రితం రాహుల్ ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో విలేఖరులతో మాట్లాడుతూ ప్రియాంకా గాంధీ వారణాసిలో పోటీ చేస్తారా.. లేదా? అనేది సస్పెన్స్‌గా ఉండడమే మంచిదని వ్యాఖ్యానించటం చర్చనీయాంశంగా మారింది. నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న వారణాసి లోక్‌సభ నియోజకవర్గానికి ఏడో దశలో అంటే మే 19న ఎన్నిక జరుగుతుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఏప్రిల్ 22న జారీ అవుతుంది. ఈ నెల 29 తేదీలోగా నామినేషన్ పత్రాలను దాఖలు చేయవలసి ఉంటుంది. నామినేషన్ పత్రాల పరిశీలన ఏప్రిల్ 30న జరిగితే ఉపసంహరణకు ఆఖరు తేదీ మే రెండు. నామినేషన్లకు తొమ్మిది రోజుల సమయం ఉన్నది కాబట్టి ప్రియాంకా గాంధీ అభ్యర్థిత్వం విషయంలో కాంగ్రెస్ అధినాయకత్వం తొందరపడటం లేదనే వాదన వినిపిస్తోంది. అసలు ప్రియాం కా గాంధీ వారణాసిలో నరేంద్ర మోదీతో తలపడాలా.. వద్దా? అనే అంశంపై కాంగ్రెస్‌లో తర్జనభర్జనలు జరుగుతున్నాయి. మోదీపై పోటీకి దిగటం రాజకీయంగా మంచి నిర్ణయం కాదని కాంగ్రెస్‌కు చెందిన పలువురు సీనియర్ నాయకులు స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. నరేంద్ర మోదీపై పోటీ చేయాలంటే కనీసం ఒక సంవత్సరం నుండి ఏర్పాట్లు చేయవలసి ఉంటుంది.. ఇప్పుడు ఈ ఏర్పాట్లేవి లేకుండా మోదీపై తలపడటం రాజకీయంగా ఆత్మహత్యాసదృసమే అవుతుందని సీనియర్ నాయకులు చెబుతున్నారు. ప్రియాంక ఓడిపోతే కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బ తగులుతుందని వారు స్పష్టంగా హెచ్చరించినట్లు తెలిసింది. ప్రియాంక ఓడిపోవటం అంటే కాంగ్రెస్ పునాదులు కదిలిపోవటమేనన్నది వారి వాద న. రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న అమేథీ, యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ పోటీ చేస్తున్న రాయబరేలీలో పార్టీ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. అమేథీలో రాహుల్ గాంధీకి ఎదురు గాలి వీస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రియాం కా గాంధీ వారణాసిలో మోదీపై పోటీ చేసి ఓడిపోవటం రాజకీయంగా తీవ్ర పరిణామాలు నెలకొంటాయన్నది వారి వాదన. నరేంద్ర మోదీని ప్రియాం కా గాంధీ ఓడించగలిగితే కాంగ్రెస్‌తోపాటు ప్రతిపక్షాలకు ఊహించలేనంత ఊతం లభించటంతోపాటు బీజేపీకి శరాఘాతం అవుతుంది. కానీ వారణాసిలో మోదీ మరోసారి భారీ మెజారిటీతో గెలిచే సూచనలు కనిపిస్తున్నందున ఈ పరిస్థితుల్లో ప్రియాంక ఆయనతో పోటీ పడటం ఎంతమాత్రం మంచిది కాదన్నది వారి వాదన. 2014 లోక్‌సభ ఎన్నికల్లో వారణాసిలో ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్ దాదాపు నాలుగు లక్షల ఓట్లతో ఓడిపోయారు. మోదీ ఈసారి అంత భారీ మెజారిటీతో ఓడిపోకపోయినా భారీ మెజారిటీతో గెలిచే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రియాంకా గాంధీ ఆయనతో పోటీ పడటం కాంగ్రెస్‌కు ఎంతమాత్రం మంచిది కాదని సీనియర్ నాయకులు స్పష్టం చేసినట్లు తెలిసింది. రాహుల్ వర్గం మాత్రం ప్రియాంకను వారణాసిలో పోటీకి దించటంపట్ల కొంత పట్టుదలతో ఉన్నట్లు తెలిసింది. మోదీని కేవలం ప్రియాం క మాత్రమే ఓడించగలుగుతారని రాహుల్ గాంధీ వర్గం భావిస్తున్నట్లు చెబుతున్నారు.
. రానున్న నాలుగైదు రోజుల్లో ప్రియాంకా గాంధీ వారణాసిలో ఎన్నికల బరిలోకి దిగటంపై రాహుల్ ఒక నిర్ణయానికి వస్తారని అంటున్నారు. ఇదిలాఉంటే బీజేపీ అధినాయకత్వం మాత్రం వారణాసిలో నరేంద్ర మోదీ ఘనవిజయానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రియాంకా గాంధీ పోటీచేసే పక్షంలో ఆమెను భారీ మెజారిటీతో ఓడించే లక్ష్యంతో పని చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.