జాతీయ వార్తలు

మోదీ ధనికులకే ‘చౌకీదార్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నాయకుడు నవజోతి సింగ్ సిద్ధూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘చౌకీదార్’ అని చెప్పుకుంటున్న ప్రధాని నరేంద్రమోదీ నిజంగానే దేశంలో ఒక్క శాతం ఉన్న ధనికులకే చౌకీదార్ అని విమర్శించారు. దేశంలోని మిగతా 99 శాతం ఉన్న అట్టడుగున ఉన్న పేదలను విస్మరించారని ఆయన శనివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ విమర్శించారు. సిద్ధు మరో అడుగు ముందుకేసి ప్రధాని మోదీ పనికిరాని (నిఖమ్మ) వ్యక్తి, జాతి వ్యతిరేకి అంటూ ధ్వజమెత్తారు. నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత ఈ ఐదేళ్ళలో కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలకు మేలు చేసిందని, అండగా నిలిచిందని అన్నారు. ఆశ్రీత పెట్టుబడిదారీ విధానాన్ని ప్రోత్సహించి, తన స్నేహితులైన భారీ పారిశ్రామికవేత్తలకు మేలు చేశారని ఆయన విమర్శించారు. రిలయన్స్ జీయో, పయ్‌టమ్ వంటి వాటికి చేయూతనిచ్చి, నష్టాలతో ఉన్న ఎస్‌బీఐ, ఎంటీఎన్‌ఎలకు చేయూతనివ్వలేదన్నారు. పైగా విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు ప్రధాని మోదీ తన వెంట ఆదానీ, అంబానీ వంటి బడా పారిశ్రామికవేత్తలను తీసుకెళ్ళారని ఆయన తెలిపారు. 18 ప్రభుత్వ రంగ సంస్థలను వారికి అప్పగించారని ఆయన విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్లను, అధికారులను వెంట తీసుకెళ్ళలేదని ఆయన విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలైన భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఇఎల్), భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్, హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ వంటి పరిశ్రమలు నష్టాలతో నడుస్తున్నాయని అన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్ 8 వేల కోట్ల రూపాయల నష్టాలతో ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పయ్‌టమ్ ప్రకటనల్లో మోదీ కనిపిస్తున్నారని, మోదీ జాతి వ్యతిరేకి అని సిద్ధూ విమర్శించారు.

చిత్రం...ఢిల్లీలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకుడు నవజ్యోత్ సిద్ధూ