జాతీయ వార్తలు

మోదీకి ఓటమి భయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనిఘాటా (పశ్చిమ బెంగాల్), ఏప్రిల్ 20: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓటమి చవి చూడనున్నదన్న భయం ప్రధాని నరేంద్ర మోదీకి పట్టుకున్నదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. దీంతో ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టి విజయం సాధించాలని ప్రయత్నిస్తున్నారని ఆమె విమర్శించారు. ఎన్నికల్లో ఓడిపోతున్నామని ప్రధాని మోదీకి తెలిసిపోయిందని, అందుకే ముఃఖం పాలిపోయిందన్నారు. మోదీకి ‘హరతంకా’ అనే ఫోబియా పట్టుకుందని ఆమె తెలిపారు. దీంతో ప్రధాని మోదీ ఎన్నికల ప్రసంగంలో ప్రతిపక్షాలపై అర్థం లేని విమర్శలు చేస్తున్నారని ఆమె విమర్శించారు. ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, న్యూఢిల్లీ, పంజాబ్, ఆంధ్ర ప్రదేశ్, గుజరాత్, ఒరిస్సాలో ఘోరంగా ఓడిపోతున్నామని మోదీ తెలుసుకున్నారని ఆమె తెలిపారు. కృష్ణానగర్ లోక్‌సభ నియోజకవర్గంలో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థికి మద్ధతుగా ఆమె శనివారం ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసంఖ్యాకంగా హాజరైన ప్రజలనుద్ధేశించి ఆమె ప్రసంగిస్తూ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై, ప్రధాని నరేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు. త్రిపురలో బీజేపీ గెలిస్తే అభ్యంతరం లేదు కానీ దీంతో 543 సీట్లు వచ్చినట్లు కాదన్నారు. అందుకే ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్‌లో సుడిగాలి పర్యటన చేస్తున్నారని, హిందు-ముస్లింల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టి, వారిని విడదీసి లబ్ది పొందాలన్న ఆలోచన చేశారని మమతా బెనర్జీ విమర్శించారు.
బీజేపీకి ఓటు వేయకండి
కృష్ణానగర్ లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థి మోహ్వమెయిత్రాను గెలిపించాల్సిందిగా ఆమె ఓటర్లకు పిలుపునిచ్చారు. దేశంలో ప్రజాస్వామాన్ని కాపాడుకోవాలంటే బీజేపీకి ఓటు వేయవద్దని కోరారు. పెద్ద నోట్ల రద్దుతో మీకు ఎదురైన కష్టాలకు ఈ ఎన్నికలతో బీజేపీకి జవాబు చెప్పాలని మమత కోరారు.