జాతీయ వార్తలు

తాయిలాలకు లొంగకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంపూర్ (యూపీ), ఏప్రిల్ 20: ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజలను ఆకట్టుకునేందుకు ఎన్నో తాయిలాలు ప్రకటిస్తున్నాయని బీఎస్‌పి అధినేత్రి మాయావతి అన్నారు. అయితే ఈ తాయిలాలకు ఆకర్షితులై మోసపోవద్దంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇక్కడి నుంచి సమాజ్‌వాది పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆజం ఖాన్‌కు మద్దతుగా ఎస్‌పీ-బీఎస్‌పి సంయుక్తంగా ఏర్పాటు చేసిన భారీ ఊరేగింపులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాయావతి ప్రసంగిస్తూ బీజేపీ ప్రకటించిన ఎన్నికల ప్రణాళికలో అన్నీ ఆకర్షణీయమైన వాగ్దానాలే తప్ప ఆచరణ సాధ్యం కాదన్నారు. ‘అచ్చేదిన్’ అంటూ బీజేపీ ఇంత కాలం చెబుతూ ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. లోగడ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కంటే ఘోరంగా బీజేపీ పాలన సాగిందని ఆమె దుయ్యబట్టారు. ‘సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్’ అనే బీజేపీ నినాదం బోగస్ అని నిరూపితమైందన్నారు. మళ్లీ బీజేపీని గెలిపిస్తేనే సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్ అవుతుందని, దేశం పురోగమిస్తుందని ఆ పార్టీ చెబుతున్న మాయ మాటలను, ఆకర్షణీయమైన వాగ్దానాలను నమ్మవద్దని ఆమె కోరారు.
నోట్ల రద్దు, జీఎస్‌టీ
దేశంలో నల్లధనాన్ని వెలికి తీసేందుకు చేపట్టిన నోట్ల రద్దుతో పేద ప్రజలు అష్టకష్టాలు పడ్డారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా జీఎస్‌టీతో ఎవరికి మేలు జరిగిందని ఆమె ప్రశ్నించారు.
పైగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయాలతో దేశంలో పేదరికం, నిరుద్యోగం మరింత పెరిగిందని ఆమె దుయ్యబట్టారు. చిన్న, మధ్య తరహా వర్తక, వాణిజ్య వర్గాలు కుదేలయ్యాయని, అవినీతి మరింత పెరిగిందని మాయావతి విమర్శించారు.
సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ప్రసంగిస్తూ ఏప్రిల్ 11, 18 తేదీల్లో జరిగిన పోలింగ్‌లో బీజేపీకి ఒక్క సీటు కూడా గెలుపొందదని అన్నారు. కేంద్రంలో ఎన్డీఏ అధికారం చేపట్టిన తర్వాత సంపన్న వర్గాలు సంతోషంగా ఉన్నాయి తప్ప దేశంలో అట్టడుగున ఉన్న పేద, మధ్య తరగతి ప్రజలు నష్టపోయారని, రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని ఆయన విమర్శించారు.