జాతీయ వార్తలు

పట్టాలు తప్పిన పూర్వా ఎక్స్‌ప్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాన్పూర్ (ఉత్తరప్రదేశ్), ఏప్రిల్ 20: హౌరా నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న పూర్వా ఎక్స్‌ప్రెస్ ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ సమీపంలో శనివారం తెల్లవారు జామున పట్టాలు తప్పింది. పూర్వా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 12 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. కాన్పూర్‌కు సుమారు 20 కిలో మీటర్ల దూరంలో గల రూమా రైల్వే స్టేషన్‌కు సమీపంలో శనివారం తెల్లవారు జామున 12.50 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. పట్టాలు తప్పిన 12 బోగీలలో నాలుగు బోగీలు బోల్తాపడ్డాయని ఉత్తర మధ్య రైల్వే ప్రజాసంబంధాల అధికారి అమిత్ మాలవీయ తెలిపారు. ఈ సంఘటనపై విచారణకు ఆదేశించినట్టు ఉత్తర మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రాజీవ్ చౌదరి తెలిపారు. రైల్వే భద్రతా కమిషనర్ ఏకే జైన్ విచారణ జరుపుతారని ఆయన వివరించారు. పూర్వా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 14 బోగీలు, 900 మంది ప్రయాణికులతో కూడిన ఒక ప్రత్యేక రైలు శనివారం ఉదయం 5.45 గంటలకు ఢిల్లీకి బయల్దేరిందని జీఎం తెలిపారు. పది బోగీలతో కూడిన మరో రైలు మిగతా ప్రయాణికులను తీసుకొని ఉదయం 7.50 గంటలకు బయల్దేరిందని ఆయన వివరించారు. ఎస్8, ఎస్9, బీ1నుంచి బీ5 వరకు, ఏ1, ఏ2, హెచ్‌ఏ1, పాంట్రీ కార్, ఒక ఎస్‌ఎల్‌ఆర్ (సీటింగ్ కమ్ లగేజ్ రేక్) బోగీలు పట్టాలు తప్పాయని రైల్వే శాఖ ఒక ప్రకటనలో వివరించింది. జిల్లా మేజిస్ట్రేట్, సీనియర్ పోలీసు సూపరింటెండెంట్, ఇతర సీనియర్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని, సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
చిత్రం...హౌరా - న్యూఢిల్లీ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో కాన్పూర్ వద్ద సహాయక చర్యలు చేపడుతున్న రైల్వే అధికారులు.